NDL: కోవెలకుంట్లలో వెలసిన పురాతన ప్రసిద్ధ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 27న పేట తిరునాళ్ల, 28న కోనేటి తిరునాళ్ళ, 29న రథోత్సవం, కళ్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.
తూ.గో: రాజమండ్రి 45వ డివిజన్ R&B వాంబే గృహాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన LTP అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
KRNL: అనంతపురం హనీ ట్రాప్ కేసులో కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ కొరడా ఝళిపించారు. ఈ కేసులో నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. రాప్తాడు రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు VRకు అటాచ్ చేయగా, సీఐ శ్రీహర్షతో పాటుగా HC గిరి, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించారు. రూరల్ SI రాంబాబు, PCలు దేవేంద్ర, జయ నాయక్‌ను డీఐజీ సస్పెండ్ చేశారు.
KKD: అన్నవరం సత్యదేవుడి వార్షిక ఉత్సవాలలో భాగంగా దివ్యకళ్యాణం ఇవాళ రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారుని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సుమారు 40 అడుగుల వెడల్పుతో వివిధ పుష్పమాలికలు, విద్యుద్దీపాల ఆలంకరణలతో కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సుమారు 25 వేల మంది భక్తులు విచ్చేస్తారని తెలిపారు.
ATP: తాడిపత్రిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ఏటిగడ్డపాలెం బ్రహ్మంగారి గుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే వ్యక్తిని హతమార్చారు. నిందితులు కత్తితో మెడపై పొడిచి, బండరాయితో తలపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు బంకమట్టి వీధికి చెందిన పెయింటర్ బాషా కుమారుడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంధన ఉత్పత్తుల కొరత లేదని విశాఖ JC విద్యాధరి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 138 బంకులు ఉండగా పెట్రోల్ 3.478, డీజల్ 2,801 కిలో లీటర్లు ఉందని తెలిపారు. ఇక HPCL కంపెనీలో పెట్రోల్, డీజిల్ 1515 కిలోలీటర్లు ఉందన్నారు. IOC కంపెనీలో 3903 కిలోలీటర్ల వున్నాయన్నారు.
VZM: దాడితల్లి గ్రామదేవత సిరిమానోత్సవం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని బొబ్బిలి CI కె.నారాయణరావు కోరారు. స్దానిక రావువారివీధిలో ఆదివారం సాయంత్రం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దాడితల్లి గ్రామదేవత పండుగలో అల్లర్లు, గొడవలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.
PPM: గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది ఇవాళ ఉదయం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ASR: దంపతుల మధ్య వచ్చిన మనస్ఫర్థలతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొయ్యూరు మండలం క్రిష్టారం గ్రామానికి చెందిన రవిబాబు తన భార్యతో గొడవపడి ఈనెల 21న ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె కిషోర్ వర్మ తెలిపారు.
కృష్ణా: అవనిగడ్డ-అశ్వరావుపాలెం ప్రధాన రహదారి నిర్మాణంలో నిర్లక్ష్యం బహిర్గతమైంది. నిర్మాణంలో ఉన్నరహదారి ఒక్కసారిగా కూలిపోవడంతో టిప్పర్ లారీ డ్రైన్‌లోకి పల్టీ కొట్టింది. రహదారి పనుల్లో నాణ్యత లోపాలపై గతంలోనే ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వాహనాల రాకపోకలకు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
GNTR: మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆదివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ మద్యం సేవిస్తున్నందున చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
WG: నరసాపురం కొప్పినీడి వారి వీధిలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 39వ కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం స్వామివారి కళ్యాణం కనుల పండువగా జరగనుంది. ఈ వేడుకలు మే 3 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
VZM: జిల్లాలో డీజిల్, పెట్రోల్‌కు ఎటువంటి కొరత లేదని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, రైతులు, వాహనదారులు ఆందోళన చెందన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు డీజిల్, పెట్రోల్ నిల్వలు అన్ని బంకుల్లో సమృద్ధిగా ఉన్నాయని, వదంతులు నమ్మవద్దని ఎస్పీ చెప్పారు. ఎవరైనా అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవన్నారు.
విశాఖలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు వాహనదారుల్లో ఆందోళన రేపుతున్నాయి. మధురవాడ, గాజువాక, కొమ్మాది ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో క్యూ లైన్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ బంకులపై ఒత్తిడి పెరిగింది. జిల్లాలో తగిన నిల్వలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు.
NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దిబగుంట్ల గ్రామంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ వజ్రపహార్’లో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇళ్లను తనిఖీ చేసి ఈమేరకు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు.