ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో శనివారం జరుగుతున్న గుమ్మనూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం తనయుడు గుత్తి, పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్‌ను ఆడారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు.
ప్రకాశం: కడప జిల్లా పోరుమామిళ్లలో జరుగుతున్న బ్రహ్మంగారిమఠం ఆరాధనల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మార్కాపురం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిపో నుంచి మఠం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. బస్సుల సమయాలు, ఇతర వివరాల కోసం ఎంక్వయిరీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ELR: కైకలూరు నియోజకవర్గం స్థాయిలో వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా ఎక్కడా త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తకూడదు, రెండు పూటలు పుష్కలంగా ఇవ్వాలి. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మెడికల్ కళాశాల విద్యార్థినుల హాస్టళ్లను శనివారం జిల్లా కలెక్టర్ డా.సిరి తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, భోజనశాల, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. DMHO వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1972పై సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే కేసులు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ELR: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డులు పరిశీలించి పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యులు మంచి వైద్యసేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించు కోవాలన్నారు. నిరుపేద రోగులు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్ళకుండా చూడాలన్నారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయం వెలుపల భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు, కూలింగ్ ఏర్పాట్లు పరిశీలించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యూలైన్లలో మంచినీరు, ఫ్యాన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
E.G: జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మీ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. హిట్ & రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని అన్నారు. రెవెన్యూ & పోలీసు అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.
PLD: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో కీ.శే. చిలకపాటి భరద్వాజాచార్యుల అకాల మరణంపై నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి సేవలను గుర్తుచేసుకున్నారు.
కోనసీమ: మురముళ్ల శ్రీవీరేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1 వరకు జరుగుతాయని ఆలయ ఏసీ సత్యనారాయణ శనివారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6:45 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. మే 1న ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీపుష్ప యాగం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30న నరసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి.
TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నాగలాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కిషోర్ పాల్గొన్నారు.
NLR: కోవూరు MLA ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని లాబొరేటరీ ఫార్మసీ స్టోర్, ఆఫీసు రూమ్‌లను సందర్శించారు. అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు, వైద్య సేవల రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానానికి ఓ కుటుంబం విరాళాన్ని అందజేసింది. విజయవాడ ప్రసాదంపాడు ప్రాంతానికి చెందిన జీ. శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆలయ అన్నదాన పథకానికి రూ. 1,01,116 విరాళంగా అందించారు.
W.G: కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మా దాయశాఖ డిప్యూటీ కమిషనర్ DVL రమేష్ బాబు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి కళ్యాణం మహోత్సవములు సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఉప కమిషనర్ V. హరి సూర్య ప్రకాష్, V. వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు ఉన్నారు. ఆలయ EO వారికి స్వాగతం పలికారు.