BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర నూర్ భాషా సంఘం ప్రధాన కార్యదర్శి, అద్దంకి పట్టణ 17వ వార్డు వైసీపీ యువ నేత కొటికలపూడి శ్రీను అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కృష్ణా: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్‌లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
TPT: జలధార కార్యక్రమం ద్వారా చెరువులకు తక్కువ ఖర్చుతో శాస్త్రీయంగా నీటి సరఫరా కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఎర్రావారిపాలెం మండలంలో పనులను పరిశీలించిన ఆయన, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణతో భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. సుస్థిర నీటి నిర్వహణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ASR: బొర్రా గుహల అభివృద్ధి కోసం ‘స్వదేశీ దర్శిని 2.0’ పథకం కింద మంజూరైన రూ.29కోట్ల 87లక్షల నిధులతో చేపట్టే పనులను అత్యంత త్వరతగతిన, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతగిరి మండలంలోని బొర్రా గుహల అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులన్నీ పక్కా ప్రణాళికతో, సిస్టమేటిగ్గా జరగాలని ఆదేశించారు.
CTR: ఎస్ఆర్ పురం మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమన్ హెచ్చరించారు. అక్రమాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి వినియోగం, అనుమానితుల సమాచారాన్ని 9440900692 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అన్నమయ్య: రాయచోటి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ ఆక్ట్ సెక్షన్ 30 అమల్లోకి వచ్చింది. అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 10:30 గంటలలోపు తప్పనిసరిగా మూసివేయాలని పోలీసులు సూచించారు. రాత్రి 11 గంటల తరువాత అకారణంగా రోడ్లపై తిరగడం, గుంపులుగా గుమికూడడం నిషేధించారు. అనుమానితులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
సత్యసాయి: నల్లమాడ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకురాలుగా పనిచేస్తున్న మేడాపురం గ్రామానికి చెందిన పాలెం రామసుబ్బమ్మను టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు గాండ్ల సంఘం నాయకులు పాలెం రామసుబ్బమ్మను సన్మానించారు. భవిష్యత్తులో పార్టీలో మరిన్ని ఉన్నత స్థాయి పదవులు పొంది, ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
VSP: మహిళల సంక్షేమానికి జగన్ పాలన ‘గోల్డెన్ పిరియడ్’ అని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణి పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లతో మహిళలకు భద్రత పెరిగిందన్నారు. అలాగే, అమ్మఒడి, చేయూత వంటి పథకాలలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
ఎన్టీఆర్: కొండపల్లిలో తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో రెండు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయాన్ని ఆయన ఇటీవల గుర్తించారు. దీనిపై గొల్లపూడిలోని కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
PLD: సత్తెనపల్లిలో మహిళా ప్రయాణికులను గమనించి బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సమన్వయకర్త డా. గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. సాయంత్రాల్లో మహిళలు వేచి ఉన్న చోట్ల బస్సులు ఆపకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఫ్రీ బస్ పథకం సక్రమంగా అమలు కావాలని కోరారు.
ప్రకాశం: ఈ నెల 20న మార్కాపురంలోని బీ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జరుగునున్నది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆవిష్కరించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను ఈనెల 26లోపు పూర్తి చేస్తామని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. 2011 జనాభా లెక్కలు, ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డులో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారని, త్వరలోనే టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఆయనను కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ అంశాలపై చర్చ సాగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను ఇరువురు నేతలు స్వాగతించారు.
GNTR: పట్టణంలోని 31, 28 వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పరిశీలించారు. కాలువల శుభ్రత, నీటి పంపుల తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. చెత్తను తడి, పొడిగా వేరు చేయాలని, మురుగు పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను కూడా స్వీకరించారు.