PLD: వెల్దుర్తి, జనాభా గణన-2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో స్వయం నమోదు ప్రక్రియలో తన వివరాలు నమోదు చేశారు. ఏప్రిల్ 17–30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొబైల్ ద్వారా 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో సంక్షేమం పారదర్శకంగా అందుతుందని చెప్పుకొచ్చారు.
VSP: సింహాచలం చందనోత్సవం నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రీజినల్ మేనేజర్ సి.బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొండపై ఏర్పాట్లను పరిశీలిస్తూ ట్రాఫిక్, రద్దీ నిర్వహణపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
AKP: కసింకోట మండలం తాళ్లపాలెం పీహెచ్సీ పరిధిలోని కచ్చలపాలెంలో గురువారం 100 ఇళ్లకు దోమల నివారణకు ఏసీఎం 5 శాతం దోమల మందు పిచికారి చేశారు. వైద్యాధికారులు డాక్టర్ రామ్, డాక్టర్ సుమ ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
CTR: 48 గంటల్లో బాలికల మిక్సింగ్ కేసును చేధించినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర గురువారం తెలిపారు. చిత్తూరు కొంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఈనెల 14 నుంచి కనిపించడం లేదని కేసు నమోదు అయింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు గుర్తించి, వారిని సురక్షితంగా తీసుకువచ్చి అప్పగించినట్టు ఆయన చెప్పారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమిస్తూ జీవో 414 విడుదలైంది. తొమ్మిది నెలలుగా సేవలు అందించిన విశ్వనాథ్ నగర అభివృద్ధికి కృషి చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు.
VZM: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 347 కేసులు నమోదు చేశామన్నారు.
నంద్యాల జిల్లా వైసీపీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా డోన్ పట్టణానికి చెందిన గజేంద్ర నాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , మాజీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డికి గజేంద్ర ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ELR: చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం నుంచి సత్తుపల్లి బండిపై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి అతివేగంతో వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానం, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించాలని సూచించారు.
అన్నమయ్య: ప్రజల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై తనిఖీలు నిర్వహించి ఈ-చలాన్లు విధించారు. ప్రజలు చట్టాలను పాటించి భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ATP: అనంతపురం మండలం ఇటుకలపల్లి సమీపంలోని మన్నీల రేంజ్లో గురువారం నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌లో జిల్లా ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. ఏకే 47, గ్లాక్ పిస్టల్ సహా నాలుగు రకాల ఆయుధాలతో ఆయన ఫైరింగ్ సాధన చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
VSP: దువ్వాడ పరిధిలో జరిగిన షాప్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2,52,500 నగదు, పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 9న షాప్ పైకప్పు పగులగొట్టి రూ.2.75 లక్షలు దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
PLD: పల్నాడులోని పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గురువారం ఆమె పర్యాటక పనులపై సమీక్షించారు. సాగర్, కొండవీడు, కోటప్పకొండ, అమరావతిలో పనులు వేగవంతం చేయాలన్నారు. బోటింగ్, సౌండ్ అండ్ లైట్ షో త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. యాత్రా కేంద్రాల్లో పరిశుభ్రత, వసతులపై దృష్టి సారించాలని సూచించారు.
GNTR: రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్ సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.
NTR: దేశ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన దివంగత వడ్డే ఓబన్న పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్, వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్ గురువారం ఆవిష్కరించారు.