• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొమ్మిది రోజులకు సరిపడా ఇంధనం: కలెక్టర్

KRNL: జిల్లాలో తొమ్మిది రోజులకు సరిపడా పెట్రోల్, ఆరు రోజులకు అవసరమైన డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి సోమవారం సాయంత్రం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. వాహనాల ఇంధన వినియోగంపై కొన్ని పరిమితులు విధించినట్లు స్పష్టం చేశారు.

April 28, 2026 / 06:57 AM IST

GVRను అభినందించిన కూటమి నాయకులు

NTR: విస్సన్నపేట మండలం పుట్రేల శివారు వీరరాఘవపురం గ్రామ వాస్తవ్యులు గాదే వెంకటేశ్వరరావు (GVR) సామాజిక సేవ అంశంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా విస్సన్నపేటలో కూటమి నాయకులు ఆయనను శాలువాతో అభినందించి సత్కరించారు. అనంతరం సామాజిక సేవలో మరింత ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు.

April 28, 2026 / 06:49 AM IST

ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కైకలూరులోని మార్కెర్ యార్డు కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్య అతిధులుగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డు నూతన పాలకవర్గంగా ప్రమాణస్వీకారం చేసిన ఛైర్మన్‌‌కి, డైరెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు.

April 28, 2026 / 06:45 AM IST

టీడీపీ ముసుగులో పనిచేస్తున్న కోవర్టులను సస్పెండ్ చేయాలి

AKP: టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వైసీపీ కోవర్టులను తక్షణం సస్పెండ్ చేయాలని అనకాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి బాబ్జి కోరారు. అనకాపల్లిలో సోమవారం మాట్లాడుతూ.. మండలానికి చెందిన ఓ నాయకుడు టీడీపీకి వెన్నుపోటుదారుడిగా మారినట్లు ఆరోపించారు. ఆ నేత టీడీపీకి చెందిన నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు.

April 28, 2026 / 06:37 AM IST

నేడు ఎమ్మెల్యే ఆనందరావు  పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ఈదరపల్లిలో వద్ద జరిగే వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక క్యాంపు కార్యాలయం నందు డ్వాక్రా మహిళకు పీఎం అజయ్ లోన్లు, యానిమేటర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

April 28, 2026 / 06:34 AM IST

నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TPT: నాగలాపురం ప్రసిద్ధ వేదనారాయణ స్వామి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పవిత్రత కోసం నిర్వహించే ఈ శుద్ధి కార్యక్రమంలో అంతర్భాగాలను సుగంధ ద్రవ్యాలు, ఔషధ పదార్థాలతో శుభ్రపరచి, అనంతరం ప్రత్యేక పూజలు చేపడతారు. ఈ కార్యక్రమం సందర్భంగా కొంతసేపు దర్శనం నిలిపివేయనున్నందున భక్తులు సహకరించాలని కోరారు.

April 28, 2026 / 06:31 AM IST

స్థల వివాదంపై కేసు నమోదు

BPT: బల్లికురవ మండల పరిధిలోని కూకట్లపల్లి గ్రామంలో నివాస స్థల వివాదానికి సంబంధించి సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తన నివాస స్థలం విషయంలో వివాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పేరి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

April 28, 2026 / 06:29 AM IST

ఈనెల 30న పార్సిల్లు వేలం పాట

GNTR: ఆర్టీసీ బస్టాండు పార్సిల్ కార్యాలయంలోని పార్సిళ్లకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తులు చెల్లించి, ఎవరైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

April 28, 2026 / 06:29 AM IST

విధుల్లో క్రమశిక్షణ తప్పనిసరి: కమిషనర్

కర్నూలు నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం సాయంత్రం పలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధుల్లో క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.

April 28, 2026 / 06:28 AM IST

పోలీసుగా మోసం చేసి అత్యాచారం.. 10 ఏళ్ల జైలు

GNTR: పోలీసునని నటిస్తూ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన వ్యక్తిపై జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. గోపి అనే వ్యక్యికి 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.23 వేల జరిమానా విధించింది. ఇప్పటికే 29 కేసులు ఉన్న నిందితుడిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది.

April 28, 2026 / 06:24 AM IST

నకరికల్లు చెరువులో తాగునీటి నాణ్యత తనిఖీ

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకరికల్లు చెరువులో నీటి నాణ్యతను ఎస్ఈ, కమిషనర్ రమ్య కీర్తన, డీఈ రఫీ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 28, 2026 / 06:15 AM IST

నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరాలు

చిత్తూరులోని సీఆర్ రెడ్డి కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ప్రారంభంకానున్నట్లు ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు, పాటలు చదువు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 28, 2026 / 06:13 AM IST

ఇంధన సరఫరాలో అక్రమాలు జరిగితే ఫోన్ చేయండి: కలెక్టర్

తూ.గో: రాజానగరంలోని ఐవోసీఎల్ పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరఫరాలో అక్రమాలు జరిగితే 8074661259 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరలు, కొలతలను పరిశీలించి, నిరంతర సరఫరాకు అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 06:13 AM IST

నేడు బాలల హక్కుల కమిషనర్ పర్యటన

PPM: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ మెంబర్ సి.మధుసూదన్ నేడు మన్యం జిల్లా, సీతంపేట మండలంలో పర్యటిస్తారని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ టి కనకదుర్గ తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బాలలు, ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అమూల్యమైన సూచనలు ఇవ్వాలన్నారు.

April 28, 2026 / 06:07 AM IST

‘కీలక ఒప్పందాలు, ప్రముఖులకు సన్మానం’

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో సహకారం, ఓఎక్స్‌ఎంఐక్యూ తో రూ. 400 కోట్ల ఏఐ సెంటర్ ఏర్పాటు, మరియు ఐఐటీఎమ్ తో రూ. 180 కోట్ల వాతావరణ పరిశోధన ఒప్పందాలను వర్సిటీ కుదుర్చుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ఎం. వెంకయ్య నాయుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సహా పలువురు పూర్వ విద్యార్థులను వర్సిటీ సత్కరిచింది.

April 28, 2026 / 06:07 AM IST