• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (బుక్ కీపర్)లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 21, 2026 / 07:27 PM IST

‘మధ్యాహ్న భోజన ఏజెన్సీలనే కొనసాగించాలి’

NTR: స్మార్ట్ కిచన్ పధకం రద్దు చేసి ప్రస్తుతం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను కొనసాగించాలని మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ఈ నెల 27న విజయవాడ కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని మంగళవారం నందిగామ సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు.

April 21, 2026 / 07:21 PM IST

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా వాసంశెట్టి వారి పేటలో రూ. 27 లక్షలతో నిర్మించనున్న 20,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, రూ.36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లీనిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

April 21, 2026 / 07:20 PM IST

680 మంది NCC క్యాడట్లకు శిక్షణ శిబిరం

KKD: పెద్దాపురం నవోదయ పాఠశాలలో NCC వార్షిక శిక్షణ శిబిరం చేపట్టినట్లు మేజర్ మహమ్మద్ అసిఫ్ మంగళవారం తెలిపారు. ఈ శిబిరానికి 680 మంది క్యాడట్లు హాజరయ్యారు. వారికి మ్యాప్ రీడింగ్, ఆయుధ శిక్షణ, బాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్, దేశ రక్షణ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ శ్రీనివాసరావు, లెఫ్టినెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.

April 21, 2026 / 07:20 PM IST

పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో జనసైనికులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని చిన్నారులతో కలిసి భోజనం చేశారు. డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వయంగా ఆయన భోజనం వడ్డించారు.

April 21, 2026 / 07:20 PM IST

పచ్చిరొట్ట పంటలపై అవగాహన కార్యక్రమం

BPT: సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం, వెల్లలచెరువు గ్రామాల్లో రైతులకు పచ్చిరొట్ట పంటలపై (జీలుగా, జనుము, పిల్లిపెసర) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి (AO) షేక్ సైదా మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా నేలలో సేంద్రీయ కర్బనం పెరుగుతుందని తెలిపారు.

April 21, 2026 / 07:14 PM IST

వైద్య సేవలపై తనిఖీలు.. ప్రజల సంతృప్తే లక్ష్యం

PPM: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డా. టి. జగన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు బాగువలస, మెంటాడవీధి ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వివరాల నమోదు, ల్యాబ్ నివేదికలు, పరికరాల పనితీరును పరిశీలించారు. పిహెచ్సీల్లో ప్రసవ సేవలు మెరుగుపర్చాలని, మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

April 21, 2026 / 07:12 PM IST

దివ్యాంగులకు బస్సు ప్రయాణ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పంపిణీ చేశారు. వడియంపేట మాజీ సర్పంచ్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం 21 రకాల దివ్యాంగతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఆమె తెలిపారు.

April 21, 2026 / 07:10 PM IST

కలెక్టరేట్లో నేషనల్ సివిల్ సర్వీస్ డే కార్యక్రమం

W.G: దేశ అభివృద్ధి, సమగ్ర సంక్షేమం, సుస్థిర పురోగతిలో సివిల్ సర్వీసుల పాత్ర అపూర్వమని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఇవాళ భీమవరం కలెక్టరేట్‌లో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా వివిధ శాఖల అధికారుల ఉత్తమ పనితీరును గుర్తిస్తూ మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సివిల్ సర్వెంట్లు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు ప్రజలకు ఎంత ఉపయోగపడతాయన్నారు.

April 21, 2026 / 07:00 PM IST

ఇది ముమ్మాటికి ప్రభుత్వ కక్షసాధింపు చర్య: ఎమ్మెల్సీ

NLR: సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీసు నుంచి తొలగించడాన్ని MLC చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యా యులు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు ఆయనను డిస్మిస్ చేయడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని విమర్శించారు.

April 21, 2026 / 07:00 PM IST

పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది: ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన టీడీపీ నాయకుడు లడ్డు ఇస్మాయిల్ భౌతికకాయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ఆయన మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

April 21, 2026 / 06:50 PM IST

రాయచోటిలో ACB దాడులు

అన్నమయ్య: కదిరి బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీపై ACB సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నగదు, బంగారం, ఇళ్లు, స్థలాలు, వాహనాలు సహా కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని కర్నూలులోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

April 21, 2026 / 06:50 PM IST

వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వెలుగు సిబ్బందికి 5జీ స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యదిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చన్నారు.

April 21, 2026 / 06:48 PM IST

‘సంకల్పం’తో డ్రగ్స్‌కు గుడ్‌బై

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సంకల్పం కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. తాడికొండ పరిధిలోని చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు వివరించారు. 6 నెలల్లో 311 మందిని అరెస్ట్ చేసి భారీగా గంజాయి, MDMA స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

April 21, 2026 / 06:46 PM IST

జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ మోసం

విశాఖపట్నంలో జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వాట్సాప్ ఖాతాలతో అధికారులు, ప్రజలకు మెసేజ్‌లు పంపుతూ అత్యవసరమని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలకు స్పందించవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరించారు.

April 21, 2026 / 06:43 PM IST