• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జలధార–జలహారతిపై అవగాహన కార్యక్రమం

VZM: జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, మన్యం జిల్లాల అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100రోజుల ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో మంచి ఫలితాల దిశగా సాగుతుందన్నారు.

April 27, 2026 / 08:25 PM IST

పోలీసుల బందోబస్త్ మధ్య డీజిల్ అమ్మకాలు

W.G: నరసాపురం పెట్రోల్ బంకుల వద్ద సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంకుల వద్ద పహారా కాస్తున్నారు. రబీ సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ డీజిల్ దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు ప్లాస్టిక్ డబ్బాలతో బంకుల వద్ద బారులు తీరారు.

April 27, 2026 / 08:22 PM IST

వెల్దుర్తిలో మే 2న సాధారణ సమావేశం.!

KRNL: వెల్దుర్తి మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం మే 2న జరుగుతుందని ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. మండల అభివృద్ధి పనులు, గ్రామ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకావాలని MPDO సూచించారు.

April 27, 2026 / 08:17 PM IST

మృతదేహం లభ్యం.. హత్య కేసు నమోదు

ASR: అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో గోస్తని నది ఒడ్డున పొదల్లో లభించిన తల లేని వ్యక్తి మృతదేహం ఘటనపై హత్య కేసు నమోదు చేశామని ఎస్సై శంకరరావు సోమవారం తెలిపారు. మృతదేహం కుడిచేయి మీద అమ్మా, నాన్న అని తెలుగులో టాటూ ఉందన్నారు. మృతుడి వయసు సుమారు 30నుంచి 40ఏళ్లు ఉంటుంన్నారు. 5.6 అంగుళాల పొడవు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు స్టేషన్లో సంప్రదించాలన్నారు.

April 27, 2026 / 08:16 PM IST

కేదారేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండలం పారశెల్లి గ్రామం శ్రీ జల భవాని సమేత కేదారేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు స్వామివారిని ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

April 27, 2026 / 08:10 PM IST

ఇంధన కొరత వదంతులు నమ్మవద్దు: ఎస్పీ

ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ప్రజలను కోరారు. అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు సృష్టించినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 27, 2026 / 08:10 PM IST

కుందన్ రెడ్డిని పరామర్శించిన బీసీ ఇందిరమ్మ

NDL: అవుకు మండలం కాశీపురంకి చెందిన కుందన్ రెడ్డి ఇటీవల ప్రమాదంలో గాయపడి HYDలోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

April 27, 2026 / 08:07 PM IST

తెనాలిలో సోమవారం ఫర్టిలైజర్స్ షాపులు బంద్

GNTR: తెనాలిలో ఫర్టిలైజర్స్ షాపు యజమానులు సోమవారం బంద్ చేపట్టారు. నిర్బంధ ట్యాగింగ్, యూరియా, DAP వంటి రాయితీ ఎరువులతో పాటు, అమ్ముడుపోని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తయారీ కంపెనీలు డీలర్లను బలవంతం చేయడాన్ని నిరసిస్తూ షాపులు మూసివేసి బంద్ పాటించారు. గత 4-5ఏళ్లుగా పెరిగిపోతున్న ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

April 27, 2026 / 08:06 PM IST

జిల్లాలో ఇంధన సరఫరా పుష్కలం: కలెక్టర్

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం జిల్లాకు ఇంధన సరఫరా వివరాలను వెల్లడించారు. మూడు ఆయిల్ కంపెనీల ద్వారా జిల్లాకు 2,57,000 లీటర్ల పెట్రోల్, 5,09,000 లీటర్ల డీజిల్ సరఫరా అవుతున్నాయని తెలిపారు. ఇంధనంతో నిండిన ట్యాంకర్లు ఇప్పటికే జిల్లాకు బయలుదేరాయని, జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

April 27, 2026 / 08:03 PM IST

పీజీఆర్‌ఎస్‌లో 388 అర్జీలు స్వీకరణ

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 388 అర్జీలను స్వీకరించారు. అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 27, 2026 / 07:55 PM IST

బాధిత కుటుంబానికి అండగా మంత్రి పయ్యావుల

ATP: వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన బోయ వినోద్ పిడుగుపాటుకు గురై మరణించగా, ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 4 లక్షల నష్టపరిహారం ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. సోమవారం కౌకుంట్ల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో వినోద్ భార్య వరలక్ష్మికి ఈ కాపీని అందజేసి ఓదార్చారు.

April 27, 2026 / 07:50 PM IST

‘ఉపాధి హామీకూలీల సమస్యలు పరిష్కరించాలి’

ELR: ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా పంచాయతీ రాజ్ వైసీపీ సెల్ అధ్యక్షుడు పుప్పాల గోపి అన్నారు. సోమవారం PGRSలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు.

April 27, 2026 / 07:50 PM IST

ఎమ్మిగనూరులో 500 మంది టీడీపీలో చేరిక

KRNL: ఎమ్మిగనూరులోని కటికగేరి ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సోమవారం పిలుపునిచ్చారు.

April 27, 2026 / 07:47 PM IST

ఏబీఎన్‌పై చర్యలు కోరుతూ.. డీఎస్పీకి వినతి

మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, కనిగిరి వైసీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ డీఎస్పీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ABN)పై, సంబంధిత వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 27, 2026 / 07:43 PM IST

కైకలూరులో ఏటీఎం దొంగ అరెస్ట్

ELR: కైకలూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24 తెల్లవారుజామున నిందితుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసినా, నగదు దొరకకపోవడంతో పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.

April 27, 2026 / 07:41 PM IST