SKLM: విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యేని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
W.G: నరసాపురం(మం) మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో విద్యుత్ సమస్యలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ పథకం, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ సబ్సిడీ గురించి అధికారులు వివరించారు. ఇందులో నర్సీపట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ కేవి.త్రినాథ్, ఏఈ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వట్లూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ వృక్షం విరిగిపడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ఈ చెట్టుని తొలగించాలని కోరారు.
SKLM: మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలోని ABN కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం కాశీబుగ్గ పోలీసులు ఆయనను ఇంటి వద్దే ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
W.G: వీరవాసరం (మం) తోలేరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం గ్రామ సభ, పునఃసర్వేలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని చెప్పుకొచ్చారు.
ATP: మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై నీచమైన రాతలు రాశారంటూ మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా జీవీఎంసీ నిర్వహిస్తున్న “వేస్ట్ టు వండర్” పోటీలకు ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు బుధవారం కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇందులో స్క్రాప్‌తో 4-8 అడుగుల శిల్పాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఇందులోని ఉత్తమ కళా ఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు.
GNTR: తెనాలి వైకుంఠపురం సమీపంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానం 28వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గుంటి వెంకట్ ఆధ్వర్యంలో 3 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, జొన్నాదుల మహేష్, వెంకటేష్, అఖిల్, షావుల్ తదితరులు పాల్గొన్నారు.
AKP: నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. జలధార-జల హారతి కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం 100 రోజులు కొనసాగుతుందన్నారు.
PLD: యడ్లపాడు మండలం జాలాది, ఉప్పరపాలెంలో బుధవారం రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పుల్లారావు శంకుస్థాపన చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు.
నంద్యాల(మం) వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డీఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ జీ. రాజకుమారి పర్యవేక్షించారు. వాల్యుయేషన్ కేంద్రంలో జరుగుతున్న పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
CTR: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రేపు పుత్తూరు, నగరిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30కు గొల్లపల్లి సచివాలయంలో పాసుబుక్‌ల పంపిణీ, 3 గంటలకు SC & BC హాస్టల్ సందర్శన చేసి విద్యార్థులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నగరి పార్టీ కార్యాలయంలో 50 మందికి CMRF చెక్కులు పంపిణీ చేయనున్నారు.
TPT: డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర పెళ్లకూరు మండలానికి చేరుకుంది. వీరిని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఆదిలక్ష్మి స్వాగతించారు. యువతతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలు బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.
W.G: పెనుగొండ మండలంలోని సిద్ధాంతం ఘాట్ వద్ద గోదావరి మోక్ష దామం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో ఈ మోక్ష దామం నిర్మించనున్నారు. స్థానిక ప్రజలకు అంత్యక్రియల కోసం శుభ్రమైన, సక్రమమైన ఆధునిక సౌకర్యాలు కల్పించబడతాయని వారు చెప్పుకొచ్చారు.