బాపట్ల: ఎంపీ కృష్ణప్రసాద్ సూర్యలంకలో పర్యటించారు. అధికారులతో కలిసి మంగళవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.97.52 కోట్లతో సూర్యలంక తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణాల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. పర్యాటకులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
గుంటూరు జడ్పీ కార్యాలయంలో రేవుల లీజ్ హక్కుల కోసం బుధవారం వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సీల్ టెండర్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2:30కి బహిరంగ వేలం జరుగుతుంది. టెండర్ దాఖలు చేసిన వారికే పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరన్నారు. అధికారులు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయమని వెల్లడించారు.
KDP: ఖాజీపేటలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో రేపు మండల సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజ సంపతి ఇవాళ తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ తమ పూర్తి నివేదికలతో సమావేశానికి తప్పక రావలసి ఉంటుందన్నారు. ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.
ASR: పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామంలో గిరిజనులు 2019 నుంచి తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగునీటి కాలువలలోని కలుషిత నీటిని తాగుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బోర్వెల్ మంజూరు చేసినప్పటికీ RWS అధికారులు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
CTR: ఏనుగు దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, డీఎఫ్‌వో సుబ్బరాజుతో కలిసి పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం గుడిపాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది రైతులకు రూ.2.76 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
PPM: కురుపాం MPDO కార్యాలయం వద్ద APD శ్రీహరి ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాదిలో నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి పనుల అమలు, నిధుల వినియోగం, కార్మికులకు చెల్లింపులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో చేపట్టిన పనుల నాణ్యత, పనిదినాల నమోదు, మస్టర్ రోల్స్, కార్మికులకు అందిన వేతనాల వివరాలను పరిశీలించారు.
PLD: క్రోసూరు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 14 మందికి రూ.1,07,45,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతోందన్నారు.
ATP: ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పద కథనాలపై రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో వారి పత్రిక ఎక్కడా కనిపించకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రజలే తరిమి కొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.
KDP: లింగాల మండలం దిగువపల్లె, కోమన్నూతల గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల ప్రధాన రహదారుల రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో రోడ్లపై మురుగునీరు ఉంటోంది. గ్రామాల్లో దుర్గంధం వెదజల్లడంతో నిల్వ చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రీన్ అంబాసిడర్లు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు.
KRNL: వెల్దుర్తిలో ఎన్ఆర్ఐ డైరెక్టర్ షణ్ముఖ్‌కు సీపీఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ నేతలు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విబి-జిరామ్ జి బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఏడాదికి 200 పని దినాలు, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని కోరారు. ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.
ATP: అనంతపురం నగరంలోని ప్రసన్నయపల్లి రాంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: ప్రపంచ ఆరోగ్య దినోత్సోవం సందర్భంగా ఇవాళ స్దానిక 42వ డివిజన్ అయ్యన్నపేట మున్సిపల్ నడక మైదానంలో ఆంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ డా.డివిజి శంకరరావు మాట్లాడుతూ.. రోజు నడక, యోగ, తదితర శారీరక వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని స్థానికులకు సూచించారు.
కోనసీమ: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి కర్ణాటక, మైసూర్ ఎనిమిది రోజుల పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్. కుమార్ తెలిపారు. ఈ బస్సు ఈ నెల 25వ తేదీ మధ్యాహం రావులపాలెం నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ వలసపాకలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం స్థానికులు పట్టుకున్నారు. పట్టపగలే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారే వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పవరం పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ సమిష్టిగా పనిచేయాలని, సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో PHCల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.