• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 10.26 లక్షల ఓట్లు

CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.

April 16, 2026 / 06:40 AM IST

వాహనాల తనిఖీలు.. 226 కేసులు నమోదు

కడప జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని SP నచికేత్ హెచ్చరించారు. బైకర్లు హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలన్నారు. బుధవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ.59,325ల జరిమానా విధించినట్లు వెల్లడించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.

April 16, 2026 / 06:39 AM IST

కర్నూలులో అండర్-16 బాలుర క్రికెట్ ఎంపికలు

KRNL: ఈనెల 19వ తేదీన కర్నూలు స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో అండర్-16 బాలుర విభాగంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన వెల్లడించారు.

April 16, 2026 / 06:32 AM IST

పర్వతారోహకుడిని సన్మానించిన కలెక్టర్

W.G: అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్మిష్ వర్మ భూపతిరాజును కలెక్టర్ నాగరాణి బుధవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు శిఖరాలు, ఏడు అగ్నిపర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా అన్మిష్ రికార్డు సృష్టించడం గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.

April 16, 2026 / 06:25 AM IST

రాయచోటిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ఇవాళ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం పట్టణంలో జరుగుతున్న అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమని సీఐ వెంకట చలపతి తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా, మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 16, 2026 / 06:24 AM IST

లారీని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

ప్రకాశం: త్రిపురాంతకం (M) రాజుపాలెం BTC కాలనీ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెంకు చెందిన శివన్నారాయణ బైక్‌పై మార్కాపురం నుంచి రాజుపాలెం వస్తుండగా.. రోడ్డుపై మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉన్న లారీని వెనుక భాగాన ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 16, 2026 / 06:15 AM IST

లోకేష్‌కి కీలక పదవి రావడంపై సంబరాలు

ATP: మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు అనంతపురం నేతలు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

April 16, 2026 / 06:04 AM IST

నేటి నుంచే జనగణన.. స్వీయ గణనకు అవకాశం

విజయనగరం: జనగణనలో భాగంగా స్వీయ గణన సౌకర్యం నేటి నుంచి ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి OTP ద్వారా నమోదు చేసి, 34 ప్రశ్నలతో తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే రిఫరెన్స్ ఐడీని ఎన్యూమరేటరు ఇవ్వాలని తెలిపారు.

April 16, 2026 / 05:55 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి (M) రాజపురం ఉపకేంద్రంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. కవిటి, రాజపురం తదితర గ్రామాలలో ఉ. 9 గంటల నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

April 16, 2026 / 04:50 AM IST

రైతుల సంక్షేమమే లక్ష్యం: DCCB ఛైర్మన్

VZM: సహకార రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కూటమి ప్రబుత్వ లక్ష్యమని జిల్లా DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన APCOB జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం మరింత పారదర్శక, సమర్థవంతమైన సేవలు అందించేందుకు ప్రబుత్వ కట్టుబడి ఉందని తెలిపారు.

April 15, 2026 / 10:00 PM IST

ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసిన నూతన డీఎస్పీ

SKLM: పలాస కాశీబుగ్గ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. భవాని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా శావల దేవదత్

NTR: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా శావల దేవదత్‌ను బుధవారం నియమించింది. ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అయితే అధిష్టానం వ్యవసాయ రంగా అభివృద్ధికి చేస్తున్న కృషికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహానికి కృషి చేస్తామన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

ELR: జిలాల్లో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం గ్రామాలలో చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. నీటి పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిపై అలసత్వం వహించకూడదన్నారు.

April 15, 2026 / 10:00 PM IST

రౌడీయిజంపై ఉక్కుపాదం: ఎస్పీ

KDP: జిల్లాలో రౌడీయిజం, గంజాయి కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరులో జరిగిన నేర సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెల్ట్ షాపులు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

April 15, 2026 / 10:00 PM IST

ఎమ్మెల్యే కోట్లను కలిసిన వలసల రామకృష్ణ

NDL: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ బుధవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

April 15, 2026 / 10:00 PM IST