• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

BPCL డిపోను పరిశీలించిన జేసీ

ATP: గుత్తిలోని కర్నూల్ రోడ్‌లో గల BPCL డిపోను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఇంఛార్జ్ తహసీల్దార్ సూర్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డిపోలోని స్టాక్ వివరాలను పరిశీలించి డీజిల్, పెట్రోల్ ఎలా సరఫరా చేస్తున్నారో అనే దానిపై ఆరా తీశారు. డిపో 24/7 రన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిల్లింగ్ డిపోను కూడా తనిఖీ చేశారు.

April 28, 2026 / 06:40 PM IST

నాగలాపురం మార్కెట్ కమిటీకి ఛైర్మన్‌గా జాన్సన్

TPT: సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఛైర్మన్‌గా జాన్సన్, వైస్ ఛైర్మన్‌గా మురళి నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేయగా, పలువురు స్థానికులు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

April 28, 2026 / 06:40 PM IST

గుడిపాల పోలీసులకు వినతిపత్రం అందజేత

CTR: వి.కోట జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి హత్యను గుడిపాల మండల జర్నలిస్టులు ఖండించారు. ఇదివరకు సాధారణ దాడులకు పాల్పడుతున్న కొంతమంది దుండగులు హత్యా రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుడిపాల ఏఎస్ఐ మునివేల్‌కు వినతి పత్రం సమర్పించారు.

April 28, 2026 / 06:39 PM IST

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన తహసీల్దార్

CTR: సదుం మండల కేంద్రంలో పెట్రోల్ బంకులను తహసీల్దారు ప్రమీల మంగళవారం తనిఖీ చేశారు. ఐఓసీ పెట్రోల్ బంకులో మరో రెండు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. నిబంధనల మేరకే అమ్మకాలు జరపాలని యజమానులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బంకులలో పంపిణీ పర్యవేక్షణకు వీఆర్వోలను నియమించినట్లు చెప్పారు.

April 28, 2026 / 06:36 PM IST

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: SP

W.G. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి అన్నారు. గొల్లలకోడేరు కార్యాలయం నుంచి మంగళవారం పోలీసు అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

April 28, 2026 / 06:35 PM IST

‘ప్రభుత్వ వైఫల్యాల వలనే ఇంధన కొరత’

ELR: ప్రభుత్వ వైఫల్యాల వల్లనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి వెంకటేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఏలూరు పవర్ పేట కాళీ పెట్రోల్ బంకు వద్ద ఆందోళన చేపట్టారు. అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసిన కూడా నిదర్శనం అన్నారు. వెంటనే పెట్రోలు, డీజిల్ గ్యాస్ కొరతలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:33 PM IST

మాచర్ల ఎమ్మెల్యే కారుపై దాడి.. ఏం జరిగిదంటే?

PLD: ఎమ్మెల్యే కాన్వాయ్‌పై బీర్ బాటిల్ పడిన విషయం తెలిసిందే. దీనిపై నిందితుడు సైదా స్పందించాడు. ‘నా ఫ్రెండ్స్‌తో కలిసి తిరునాళ్లకు వెళ్లా, అక్కడ మద్యం తాగిన సమయంలో గొడవ జరిగింది, నా ఫ్రెండ్‌పైకి బీరు బాటిల్ విసిరాను, అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే కాన్వాయ్ రావడంతో దానిపై పడిందని చెప్పుకొచ్చాడు’. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు అని సైదా అన్నాడు.

April 28, 2026 / 06:33 PM IST

ఈనెల 30న మెగా జాబ్ మేళా

అన్నమయ్య: రాయచోటిలోని భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఈనెల 30న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదికి పైగా కంపెనీలు పాల్గొని 500కిపైగా ఉద్యోగాలు అందించనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు తెలిపారు. 

April 28, 2026 / 06:30 PM IST

‘సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత’

అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ భీమరశెట్టి రాంకి తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం సమస్యలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

April 28, 2026 / 06:22 PM IST

‘తాగునీరు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

ప్రకాశం: ఒంగోలు రూరల్ మండలాలలో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను పారదర్శకంగా వినియోగించాలని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, మురుగుకాల్వలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో నిక్కచ్చితనం పాటించి ఆదాయ వనరులు పెంచాలన్నారు.

April 28, 2026 / 06:22 PM IST

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి

మార్కాపురంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై బోడపాడు గ్రామ పొలాల్లో ఒంటేరు పోలమ్మ అనే మహిళ మృతి చెందింది. మరొక మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈదురుగాలులకు బోడపాడులోని కోళ్ల ఫారం షెడ్డు కూలి చింతకుంట్ల కుమారి అనే మరో మహిళా మృతి చెందింది.

April 28, 2026 / 06:22 PM IST

సచివాలయాలలో శ్యామలాదేవి తనిఖీలు.!

GNTR: తెనాలి పట్టణంలోని పెరుగు మార్కెట్ 1, 2 సచివాలయాలను యస్‌వీడబ్ల్యూఎస్ మేనేజర్ శ్యామలాదేవి సందర్శించారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

April 28, 2026 / 06:22 PM IST

గుత్తి మండలంలో విషాదం

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో భోయగడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 28, 2026 / 06:20 PM IST

జర్నలిస్టుల భద్రతపై ఆందోళన

TPT: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ హత్యను నిరసిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూన అజయ్ బాబు మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:14 PM IST

ఫేషియల్ విధానంపై గ్రామస్థుల నిరసన

ASR: ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం డుంబ్రిగూడ మండలం అధ్యక్షుడు పాంగి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని లోగిలి గ్రామంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఫేషియల్ విధానం వల్ల మారుమూల ప్రాంతాలలో గిరిజన శ్రామికులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ విధానం వల్ల సమస్య తప్ప ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

April 28, 2026 / 06:11 PM IST