KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
NDL: బేతంచెర్ల చౌడేశ్వరి మాత కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా మ్యాట్‌పై నిర్వహిస్తున్న ఈ పోటీలకు 30 జట్లు హాజరయ్యా యి. మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వీటిని ప్రారంభించారు. యువకుల కేరింతలు, ఈలల మధ్య కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.
BPT: బాపట్లలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్, మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాధాకృష్ణ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా, ఈ ర్యాలీని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు వారు తెలిపారు.
KRNL: ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన యూకే సుహాసిని ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందిస్తూ, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని కోరారు.
SKLM: అరసవిల్లి -కాజీపేట శ్రీ ఆసిరిమ్మ తల్లి సిరిమాను పండగల నిమిత్తం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావుకి బుధవారం వినతి పత్రం అందజేశారు. పండుగలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీరు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్ తదితర అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అరసవల్లి అమ్మవారి కమిటీ సభ్యులు కోరారు.
TPT: ఈ ఏడాది తొలి మూడు నెలల్లో TTD ట్రస్టులకు రూ.374.24 కోట్ల రికార్డు విరాళాలు వచ్చాయి. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.149.55 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.66.18 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.37.12 కోట్లు లభించాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు మూలధనం రూ.2,556 కోట్లకు చేరిందని టీటీడీ అధికారులు తెలిపారు.
AKP: అనకాపల్లికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థల పరిశీలన చేశారు. అచ్చయ్యపేట వద్ద పరిశీలించిన స్థలం అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
PPM : CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రి గుమ్ముడి సంద్యారాణి పేర్కొన్నారు. బుధవారం సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF నుంచి మంజూరైన రూ. 9,87,512 విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు అండగా సీఎం సహాయనిధి ఉందని స్పష్టం చేశారు.
NDL: శ్రీశైలం జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 42.6064 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. డ్యాం నీటిమట్టం 822.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండల ప్రభావంతో రోజుకు సుమారు 303 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోంది.
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం SC, ST ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. SC, ST కుటుంబాల విద్యుత్ ఖర్చులు తగ్గించడం, స్వయం సమృద్ధిని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.
SKLM: పొందూరులోని మొదలవలస సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వాసుదేవరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు ఫైళ్లను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ సర్వే, ఇంటి పనులు చెల్లింపు మొదలగు వివరాలను పరిశీలించి సిబ్బందికి నిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారి పాలన విషయం గురించి చర్చించారు
KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామంలో నిర్వహించిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో MLA బీవీ పాల్గొన్నారు. చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమం 4 దశల్లో అమలవుతుందని, మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, చివరి దశలో 5 రోజుల్లో రిపోర్టింగ్ ఉంటుందన్నారు
కడపలో హౌస్ అరెస్ట్‌లు జరిగాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఇ. బాలస్వామి రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యలే తీసుకున్నామని చెప్పారు. అంజాద్ బాషా, నిత్యానంద రెడ్డి కోర్టుకు హాజరయ్యారని, ఎవరినీ నిర్బంధించలేదని స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
VZM: సీతానగరం మెయిన్ రోడ్డుకు ఆనుకుని చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసరాలు అధ్వానంగా స్థితికి చేరుకున్నాయి. గ్రామంలో సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పడేస్తుండటంతో కుప్పలు పెరిగి, దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఈ దారిలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. తక్షణమే చెత్తను శుభ్రం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఇటీవల పదిమంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు 4వ తేదీన ఎస్పీ అజిత వేజెండ్ల పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా అంతమంది పోలీసులను బదిలీ చేయడం, చివరకు ఆర్డర్స్ రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది.