KRNL: ఏబీఎన్ రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని సీఐ జయన్నను కోరారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
KDP: మైదుకూరు విద్యుత్ డివిజన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా సోలార్ యూనిట్లు ప్రభుత్వ మంజూరు చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం తీసుకొని, విద్యుత్ బిల్లుల భారమును తగ్గించుకోవాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీపతి తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.
విశాఖలో జరగనున్న చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భద్రత, తాగునీరు, రవాణా, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
VSP: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో విశాఖలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు అందజేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని మేకడోణ, నౌలేకల్ గ్రామ శివారుల్లో ఎల్.ఎల్.సీ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జేసీబీ ద్వారా తొలగించారు. కాలువలో ఆకులు, చెత్తాచెదారంతో నిండుకొనిపోయి అపరిశుభ్రంగా మారడంతో స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎల్.ఎల్.సీ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది.
W.G: ఆకివీడు పెదపేటలో గురువారం పోలీస్ పికెట్ కొనసాగుతోంది. SI హనుమంతు నాగరాజు పర్యవేక్షణలో రామాలయం వద్ద 12 మంది Slలు, ASIలు, కానిస్టేబుళ్లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలులో ఉందని, పరిస్థితి ప్రశాంతంగా ఉన్నందున ఎవరూ ఆందోళన చెందవద్దని SI తెలిపారు. ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
VSP: భారతీయ జనతా పార్టీ 46సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కేబీచ్ వద్ద జరిగింది. విశాఖలో ప్రతి వార్డులోనూ బీజేపీ జెండా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.
CTR: మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. పుంగనూరు సీఐ సుబ్బారాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. మహిళల పట్ల ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పల్నాడు: నరసరావుపేట SBI ప్రధాన శాఖలో జిల్లా కోర్టు ప్రత్యేక విభాగాన్ని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె. మధుస్వామి ఆర్‌ఎం రవికుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఈ ప్రత్యేక కౌంటర్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
VZM: వంగర KGBV గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్ రోహిణి గురువారం తెలిపారు. ఈ మేరకు 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఫొటోలు, ఇన్‌కమ్, క్యాస్ట్, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూ...
తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, డీఆర్‌వో నరసింహులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వినడంతో పాటు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
బాపట్ల: పంగులూరు మండల కేంద్రంలోని APM వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్‌లో జనగణన-2027 (Census 2027) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని, అన్నారు.
ELR: మండే ఎండలు, వడగాడ్పుల నేపధ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం ఒక మంచి పరిణామం అని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.
పల్నాడు: మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని మహిళలందరికి క్షమాపణలు చెప్పాలని నియోజకవర్గ వైసీపీ నేతలు కోరారు. మహిళలపై చేసిన అసంబద్ధమైన వాక్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. వైసీపీ రాష్ట్ర నాయకులు ఈదా సాంబిరెడ్డి, ఎంపీపీ మీరయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు: జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.