KDP: YCP అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై ABN ఛానల్లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని YCP రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. బుధవారం సిద్ధవటం (మం) భాకరాపేటలో ఆమె మాట్లాడారు. రాధాకృష్ణ ఒక ఛానల్ ఎండిగా సమాజాలకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
SKLM: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తి గౌరవం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోందని జాతీయ కమిటీ సభ్యుడు ఎన్. ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా పోరాటం చేస్తామన్నారు.
VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని నెల్లిమర్ల జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్షులు తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం నెల్లిమర్ల జూట్ మిల్ వద్ద నిరసన చేపట్టారు. బ్రిటిష్ కాలంలో కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తులు అసెంబ్లీపై పొగబాంబు విసిరారని గుర్తుచేశారు.
ASR: రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డుంబ్రిగూడ యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డుంబ్రిగుడలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 12న రంపచోడవరంలో 6వ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. మండలంలో ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయని, మిగిలిన పంటలు కూడా కోతలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
అన్నమయ్య: మదనపల్లె నుంచి తిరువన్నామలైకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ నం.17165 తెల్లవారుజామున 01:05 గంటలకు బయలుదేరి ఉదయం 07:28 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. భక్తులకు అనుకూలంగా ఈ సేవలను ప్రారంభించగా, తక్కువ ధరలతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
PLD: ప్రత్తిపాడు ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని వైసీపీ ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ భరోసా ఇచ్చారు. గుంటూరు ఆర్టీవో ఆఫీసు సమీపంలోని తన నివాసంలో బుధవారం ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
ప్రకాశం: సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా DYFI యువజన ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ‘జన చైతన్య జీపు యాత్ర’ బుధవారం సింగరాయకొండకు చేరుకుంది. ఈ యాత్ర ఏప్రిల్ 6 నుంచి 9 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. ఈ సందర్భంగా గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై నిర్వాహకులు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
PLD: చిలకలూరిపేట కృష్ణ మహల్ రోడ్డులో అపార్ట్‌మెంట్ నిర్మాణం స్థానికులకు శాపంగా మారింది. బిల్డర్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల శబ్దాలు, భూ ప్రకంపనలతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. రక్షణ వలయాలు లేకపోవడంతో రాళ్లు పడి పక్క ఇళ్ల అద్దాలు పగులుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ఆ నిర్మాణ పనులను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
SKLM: విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యేని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
KRNL: ఆలూరు(మం) ముద్దునగేరిలో బూడిద గుమ్మడికాయ రైతులు ధరలు లేక ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకూ పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి రావడం లేదన్నారు. మార్కెట్‌లో కిలో రూ.2 ధర మాత్రమే పలుకుతోందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వారు కోరారు.
W.G: నరసాపురం(మం) మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో విద్యుత్ సమస్యలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ పథకం, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ సబ్సిడీ గురించి అధికారులు వివరించారు. ఇందులో నర్సీపట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ కేవి.త్రినాథ్, ఏఈ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.
అన్నమయ్య: స్లీపర్ బస్సులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 300 Kmలకు పైగా ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్ల పనితీరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
GNTR: యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.