• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సెన్సస్ 5K రన్ లో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్

ATP: అనంతపురం నగరంలో జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి మలోలాతో కలిసి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

April 26, 2026 / 12:12 PM IST

ఘనంగా వాసవి అమ్మవారి జయంతి వేడుకలు

CTR: నగరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

April 26, 2026 / 12:09 PM IST

ప్రభుత్వ ఖాజీగా అక్రమ్ భాష నియామకం

సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఖాజీగా హఫీజ్ అక్రమ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో MLA కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కందికుంటకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అక్రమ్ భాష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

April 26, 2026 / 12:00 PM IST

‘తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి’

ELR: చింతలపూడి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సైతం తమకు సహకరించాలని స్థానిక కమిషనర్ అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని సూచించారు. అలాగే తమ పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీని ద్వారా రోగాలు దరిచేరవని వివరించారు.

April 26, 2026 / 11:56 AM IST

ఉంగుటూరులో వాసవి మాత జయంతి వేడుకలు

ELR: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఆదివారం ఉంగుటూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించి పలు ఆలయాలలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త పుల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

April 26, 2026 / 11:50 AM IST

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన గౌరు జనార్దన్

NDL: గడివేముల మండల కేంద్రంలో దేశం సత్యం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాణ్యం యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొన్నాయి.

April 26, 2026 / 11:47 AM IST

‘ప్రజలందరు జనగణన సర్వే ప్రక్రియకు సహకరించాలి’

KRNL: జిల్లా ప్రజలందరూ జనగణన సర్వే ప్రక్రియకు సహకరించి, నమోదు చేసుకోవాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. ఇవాళ ఎంపీ కార్యాలయంలో జనగణన స్వీయ ఎన్యుమరేషన్ భాగంగా ఇటివల స్వీయ గణన చేసుకున్న ఎంపీ నాగరాజుకు జనగణన సహాయాధికారి శివన్న మెమెంటో అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం స్వీయ గణనలో పాల్గొని సరైన వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

April 26, 2026 / 11:40 AM IST

చిన్న అన్నవరంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

ELR: లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటిరోజు స్వామి అమ్మవార్లను ఆలయ వేద పండితులు స్వామివారిని పెళ్ళి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు.

April 26, 2026 / 11:34 AM IST

అంబేద్కర్ విగ్రహం పై రాళ్లతో దాడి

అనకాపల్లి పట్టణం గవరపాలెం అంబేద్కర్ నగర్లో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై రాళ్లతో దాడి చేసి కనుబొమ్మను పగలగొట్టారు. విషయం తెలుసుకున్న జనసేన సమన్వయకర్త భీమరశెట్టి రాంకి ఆదివారం ఘటన స్థలాన్ని సందర్శించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

April 26, 2026 / 11:34 AM IST

‘ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారింది’

KRNL: వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరులో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. బినామీల జోరు పెరిగిందని, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

April 26, 2026 / 11:32 AM IST

‘మంత్రి కొండపల్లి ఒక్క పెన్షన్ అయిన ఇచ్చారా’

విజయనగరం: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన ప్రజా సమస్యలపై గళమెత్తారు. పెన్షన్ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటివరకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. MSME శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు.

April 26, 2026 / 11:32 AM IST

5K రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

E.G: సెన్సస్–2027 అవగాహన కోసం ఆదివారం ఉదయం వై జంక్షన్ వద్ద నుంచి 5K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా రన్‌ను ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. ఏప్రిల్ 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 23 వేల మంది నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది.

April 26, 2026 / 11:30 AM IST

ఎమ్మెల్యే అనుచరుల దాడిపై సీఎం ఆగ్రహం

ATP: టోల్ గేట్ సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గండబోయినపల్లె వద్ద జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

April 26, 2026 / 11:29 AM IST

నగర పాలక ప్రజలకు గమనిక

TPT: తిరుపతి నగరపాలక సంస్థలో ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 10.30 నుంచి 11.30 వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుంది. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు 0877-2227208 నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. వినతిపత్రం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవ్వాలన్నారు.

April 26, 2026 / 11:28 AM IST

‘జనగణనలో అందరూ భాగస్వామ్యం కావాలి’

NLR: జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదివారం సూచించారు. జనగణనపై అవగాహన కల్పిస్తూ నెల్లూరు నగరంలో 5కే రన్ జరిగింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో VRC స్టేడియం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సూచించారు

April 26, 2026 / 11:27 AM IST