కడప జిల్లాలో మహిళా భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట CI నాగార్జున ఆధ్వర్యంలో గాలివారిపల్లిలో మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో SMS ద్వారా 112కు సమాచారం ఇస్తే 10 నిమిషాల్లో పోలీసులు స్పందిస్తారని తెలిపారు.
PLD: కోటప్పకొండలో జూన్ 1 నుంచి 5 వరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కరపత్రాలను నేతలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగ సమస్యలపై యువత పోరాడాలని రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. యువత హక్కులు, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో మేధావులతో లోతైన చర్చలు ఉంటాయన్నారు. యువకులు భారీగా తరలిరావాలని కోరారు.
KRNL: ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపు ఐక్య సంఘం భవనంలో మంగళవారం SERP ఆధ్వర్యంలో VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి వీఓఏలకు 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. వీటితో గ్రామీణ స్థాయిలో సేవలు మరింత సమర్థంగా అందించాలన్నారు.
AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న రాంబిల్లిలో రెన్యూ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌తో కలిసి సమీక్షించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
సత్యసాయి: గోరంట్ల మండలం చిత్రావతి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తహసీల్దార్ మధు నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు.
VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానుండటంతో భద్రత, వేదిక, గ్యాలరీలు, హెలిప్యాడ్, రూట్ మ్యాప్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు కీలక సూచనలు చేశారు.
GNTR: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం తెనాలి వచ్చిన ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో ‘8వ పోషణ్ పక్షోత్సవాలు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పీ.డీ వసంత బాయి తల్లి-శిశు పోషణ ప్రాముఖ్యత వివరించగా, అధికారులు పిల్లల అభివృద్ధి, జంక్ ఫుడ్ దుష్ప్రభావాలు, ఆరోగ్య పరీక్షలపై సూచనలు చేశారు.
ELR: చింతలపూడి బస్టాండ్ ఆధునికరణ పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టబడుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా బస్టాండ్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నారు.
NDL: నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్ర పర్యాటకానికి పెద్దపీట వేసింది. అరకు, పాపికొండలు, గండికోట ప్రకృతి అందాలను, తిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాలను ప్రశంసించింది. పూతరేకులు, ఉలవచారు వంటి వంటకాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పర్యాటకులు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఏపీని సందర్శించాలని 13 పేజీల నివేదిక, ప్రత్యేక వీడియో ద్వారా సూచించింది.
KRNL: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌పై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకప్ప హెచ్చరించారు. ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై విమర్శలు తగవని అన్నారు.
KDP: మైదుకూరు సబ్ డివిజన్ నేర సమీక్షలో ఎస్పీ విశ్వనాథ్ రౌడీ షీటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. అక్రమ మద్యం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహనతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.
W.G: పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఇవాళ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. పుట్టబోయే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తాదుల సౌకర్యార్థం మంగళవారం మెయిన్ గేట్ నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు మీద కూల్ పెయింట్‌ను వేసినట్లు ఆలయ ఈవో విజయ రాజు తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. వేసవి కాల దృష్ట్యా ఆలయానికి నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ కూల్ పెయింట్‌ను వేశామన్నారు.
అన్నమయ్య: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో SERP–వెలుగు–DRDA ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి VOAలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యర్థనపై సిమ్ కార్డులు, మొదటి నెల రీచార్జ్‌ను స్వంత నిధులతో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో మహిళల్లో ఆనందం వ్యక్తమైందన్నారు. డిజిటల్ సేవల వినియోగంతో మహిళలు మరింత సాధికారత సాధిస్తారని తెలిపారు.