ASR: కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ ముళ్ళుమెట్ట గ్రామంలో ఉన్న జీపీఎస్ టీడబ్ల్యూ పాఠశాలను మండల విద్యాధికారి ఎల్.రాంబాబు గురువారం సందర్శించారు. ముందుగా పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో గార్డెన్‌ను పరిశీలించారు. కూరగాయలు పండిస్తున్న తీరును పరిశీలించారు.