GNTR: రేవంద్రపాడు వద్ద బకింగ్ హోమ్ కెనాల్‌పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్నించాలని నూతక్కి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రేవంద్రపాడు వంతెనపై నిత్యం వేలాదిమంది ప్రజలు, రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.