KKD: జగ్గంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డు అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.