BPT: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. బాపట్ల పట్టణం 20వ వార్డు భీమవారి పాలెంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని అన్నారు. అన్నా క్యాంటిన్లను తిరిగి ప్రారంభించామన్నారు.