KRNL: పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రత్నించాడు. రసూళ్లపేటకు చెందిన జనార్ధన్, ప్రేమ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం, ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి అకారణంగా కొట్టడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన జనార్ధన్, ఆత్మహత్యకు ప్రత్నించాడని, ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.