KKD: పిఠాపురం పట్టణంలో స్థానిక లైన్స్ క్లబ్ ప్రాంతంలో కుండల సూర్యనారాయణ ఇంటి ఆవరణలో శనివారం అరుదైన బ్రహ్మ కమలం విరబూసింది. హిమాలయాల్లో మాత్రమే వికసించే ఈ బ్రహ్మకమలం తమ ఇంటి ఆవరణలో విరబూయడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. స్థానికులు బ్రహ్మకమలం పుష్పానికి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.