కాకినాడ: పరీక్ష రాసేందుకు విజయవాడ నుంచి విశాఖకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన గంటకే ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కడుపుకోత మిగిలింది. కాకినాడ జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారిపై తుని మండలం ఎర్రకోనేరువద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీబీఏ విద్యార్థులు మృతి చెందారు.