కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. అవనిగడ్డలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు నమోదు చేయించుకోవలసిన పట్టభద్రుల నుంచి దరఖాస్తుల సేకరణ కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. కూటమి నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, టీవీ గిరి,చిట్టిబాబు పాల్గొన్నారు.