ఏలూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చెవుడు నివారణ కార్యక్రమంలో భాగంగా వినికిడి సమస్య, చెవుడు వున్నవారికి వినికిడి మిషన్లు ఉచితంగా పంపిణీ చెయ్యడం జరుగుతుందని ఏలూరు డీఎంహెచ్ఓ శర్మిష్ట మంగళవారం తెలిపారు. ఆధార్, రేషన్ కార్డ్ జిరాక్స్, చెవుడు తనికీ సర్టిఫికేట్ పత్రాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.