కోనసీమ: నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24వ తేదీన వికాస సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లోని సంస్థ జిల్లా కార్యాలయంలో మేళా ఉంటుందన్నారు. కాకినాడకు చెందిన రిప్యూటెడ్ ఫార్మా కంపెనీలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. SSC, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.