ASR: కొయ్యూరు మండలంలో గిరిజన రైతులకు అరకొరగానే రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారని ఎంపీపీ బడుగు రమేష్ ఆరోపించారు. గురువారం జరిగిన జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొయ్యూరు మండలంలో పూర్తిస్థాయిలో గిరిజన రైతులకు రాజ్ మా విత్తనాలు పంపిణీ చేయలేదని, దీంతో గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. అర్హులైన రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.