VSP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అత్యవసర విభాగంలో రోగులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సీటీ స్కానింగ్ సేవలు లభిస్తాయన్నారు.