ఏపీ(AP)లో జూన్ నెల వచ్చినప్పటికీ రాష్ట్రంలో వడగాలుల తీవ్రత ఇంకా తగ్గలేదు.అయితే జూన్-12 నుంచి స్కూల్ (School) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు మాత్రం అప్పుడే స్కూల్స్ రీఓపెన్ (Reopen) వద్ద అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత తగ్గాకే స్కూళ్లు ఓపెన్ చేయాలని వారు ప్రభుత్వాలను కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం (Govt) మాత్రం స్పందించలేదు.కాగా.. జూన్-12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (MLA Angani Sathyaprasad) కోరారు. జూన్ రెండో వారం ముగుస్తున్నప్పటికీ ఇంకా ఉష్ణోగ్రతలు (Temperatures) ఏమాత్రం తగ్గలేదు.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పాఠశాలలు పునఃప్రారంభం 10 రోజులు వాయిదా వేయాలని ఆయన కోరారు. అయితే ఎలాగో వచ్చేవారం రుతుపవనాలు (Monsoons) ఏపీని తాకే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాబట్టి దాదాపుగా స్కూల్స్ రీఓపెన్ జూన్-12 నుంచే ఉండొచ్చు. తెలంగాణ(Telangana)లో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.