ఎండలతో అల్లాడిపోతున్న జనానికి తొలకరి వానలు పలకరించాయి. జూన్ (June) రెండోవారం గడిచిపోతున్న తొలకరి జాడ లేక గత వారం పదిరోజులుగా జనం మలమల మాడిపోతున్నారు. ఏపీలో వాతావరణం (Weather) ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి.తిరుపతి(Tirupati)లో సోమవారంసాయంత్రం భారీ వర్షం కురిసింది. తొలకరి పలకరించడంతో తిరుపతి ప్రజలు పులకరించిపోయారు. రెండ్రోజుల నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావంతో చినుకులు, మోస్తరు జల్లులు కురుస్తున్నాయి.
కాగా, ఇవ్వాల భారీ వర్షం (heavy rain) కురిసింది. దీంతో ఎండ వేడిమి, ఉక్కపోత పరిస్థితుల నుంచి జనం ఊపిరి పీల్చుకున్నారు.ఇక.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వర్షం కురిసినట్టు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తారంగా విస్తరించడంతో తొలకరి జల్లులు పడుతున్నాయి. రేపో, మాపో తెలంగాణ (Telangana) జిల్లాలకు కూడా నైరుతి విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికై రైతులు(Farmers)దుక్కులు దున్నుకుని వరినారు పోసుకునేందుకు సిద్ధమయ్యారు. పత్తి, ఇతర విత్తనాలు విత్తుకునేందుకు కూడా విత్తనాలు సేకరించుకుని రెడీగా ఉన్నారు.