»Weather Update Rains To Continue For One More Days In Andhra Pradesh Telangana Amid Surface Trough
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..రేపు పిడుగులు పడే ఛాన్స్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(Weather Department) రెయిన్ అలర్ట్(Rain alert) జారీ చేసింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు వాన(Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(yellow Alert) జారీ చేసింది.

ఏపీ(Ap)తో పాటు యానాం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, ఏపీలో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమలల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్(Alert) జారీ చేసింది.
తెలంగాణ(Telangana)లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow alert)ను జారీ చేసింది. ఇప్పటికే వడగళ్ల వాన వల్ల తెలంగాణలో చాలా వరకూ పంటలు నాశనం అయ్యాయి. మరోమారు అలర్ట్ జారీ చేయడంతో తెలంగాణలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.