శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple)లో భ్రమరాంభ అమ్మవారి(Bhramaraambha) వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి గ్రామదేవత అంకాలమ్మ(Ankaalamma)కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భ్రమరాంబాదేవికి ఏకాంత పూజలు, నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణాలు నిర్వహించినట్లు శ్రీశైలం దేవాలయం ఈవో లవన్న తెలియజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారంగా రజకుని ఆధ్వర్యంలో చక్రం వద్ద స్థల శుద్దిని చేపట్టారు.
శ్రీశైలం ఆలయం (Srisailam Temple) ఆవరణంలో ముగ్గులు వేసి పూజలు నిర్వహించారు. వందల కేజీల పసుపు కుంకుమలతో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేద పండితులతో ఈవో లవన్న శాంతి పూజలు పూర్తి చేశారు. శ్రీశైలం ఆవరణంలో 4000 గుమ్మడి కాయలు, రెండు వేలకుపైగా కొబ్బరి కాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో పూజలు (Pooja) నిర్వహించారు.
వ్యాపార సంఘాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు నిమ్మకాయలు, గుమ్మడికాయలతో అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద సాత్విక బలిని నిర్వహించారు. ప్రతి ఏడాది కూడా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారం కుంభోత్సవం (kumbhotsavam) నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా బలి గడియలు మంగళవారం రావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి నిజరూప దర్శనాన్ని ఆలయ అధికారులు ప్రజలకు కల్పించారు.