ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) అనూహ్య ఫలితం వెలువడింది. 23 ఓట్లతో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ (Cross voting) పడింది.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) అనూహ్య ఫలితం వెలువడింది. 23 ఓట్లతో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ (Cross voting) పడింది. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇప్పటికే మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పరాజయం వైసీపీ (YCP) నాయకత్వానికి మింగుడుపడడం లేదు. అనురాధ గెలుపు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి మండలిలో టీడీపీ (TDP) పాతినిధ్యం లేదని అనుకున్న సమయంలో నలుగురు సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది. మరోవైపు క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితిని స్వయంగా చూస్తున్న శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారన్న చర్చ ప్రారంభమైంది. దీంతో వైసీపీ పెద్దల్లో భయం కనిపిస్తోందని అంటున్నారు. ఈ విజయం రాజకీయంగా ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) తీవ్ర ప్రభావం చూపుతుందని అధికార పార్టీ భయపడుతోంది.