»Rayapati Sambasiva Rao Asked President Rule In Andhra Pradesh
Rayapati:జగన్ సర్కార్‌కు మూడింది..రాష్ట్రపతి పాలన విధించండి: రాయపాటి
Rayapati Sambasivarao:ఏపీ సీఎం జగన్‌పై (jagan) సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasivarao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ నేత బాలకోటిరెడ్డి (Balakotireddy) కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రాయపాటి విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.
Rayapati sambasiva rao asked president rule in andhra pradesh
Rayapati Sambasivarao:ఏపీ సీఎం జగన్‌పై (jagan) సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasivarao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ నేత బాలకోటిరెడ్డి (Balakotireddy) కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రాయపాటి విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. వైసీపీ (YCP)కి పోలీసులు తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల 2వ తేదీన ప్రత్యర్థులు బాలకోటిరెడ్డిపై (bala kotireddy) కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గాయపడటంతో నరసరావుపేటలో చికిత్స అందించారు. మూడురోజుల కింద పరిస్థితి విషమించటంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలకోటిరెడ్డి మృతి చెందారు (dead). పలువురు టీడీపీ నాయకులు బాలకోటిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దాడి జరిగిన రోజు నుంచి గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
బాల కోటిరెడ్డి (bala kotireddy) గతంలో రొంపిచర్ల ఎంపీపీగా, ఆయన భార్య గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆరు నెలల కింద గ్రామానికి చెందినవారే గొడ్డలితో దాడి చేశారు. ఆ గాయాల నుంచి కోలుకుని, మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల తుపాకీతో కాల్పులు జరిపారు. అలవాల గ్రామానికి చెందిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి కాల్పులకు సూత్రధారి అని తెలిసింది. పూజల రాములు, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేశారు.
పట్టాభిరామ్ (Pattabhiram) విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరు సరైంది కాదని రాయపాటి అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (President Rule) విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని కోరారు. త్వరలో ప్రభుత్వం మారుతుందని.. ప్రజలకు మంచి రోజులు వస్తాయని రాయపాటి సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు.