కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై కోటంరెడ్డి వర్సెస్ మంత్రులు/ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. సీఎం జగన్ తీరును ఏకీపారేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ ప్రభుత్వం మానేయాలని సూచించారు. ఫోన్ ట్యాప్ చేయడం పెద్ద నేరం అని చెప్పారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తన లోకేషన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. సీఎం జగన్ను నేతలు ప్రశ్నించవద్దా అని అడిగారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే సీఎం కావచ్చునని, ఈ విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు కావచ్చని సందేహాం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గురించి మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో తాను పడ్డ కష్టం.. ఇప్పుడు కోటంరెడ్డికి వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోటంరెడ్డికి సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ లక్ష్యంగా కోటంరెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటివరకు పార్టీ, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి అనుచరులతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తానని వారికి చెప్పారని తెలిసింది. చంద్రబాబుతో సమావేశమై.. టికెట్ కన్ఫామ్ చేసుకున్నాక తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి ఉంటారు. వైసీపీ నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు.