చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ నేపథ్యంలో పలువురు టీడీపీ (TDP) నాయకులతో పాటు కార్యకర్తలని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని కూడా వారు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే పీఏసీ (PAC Metting) మీటింగ్‌లో పాల్గొనేందుకు పవన్ వెళుతుండగా,ఆయనని అరెస్ట్ చేశారు. బాబు అరెస్టు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఎంత విజ్ఞప్తి చేసినా వినక పోవడంతో అరెస్ట్ చేయక తప్పలేదని పోలీసులు అంటున్నారు.
అనుమంచిపల్లి(Anumanchipalli)లో పవన్‌తోపాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరికి పోలీసులు స్వయంగా తమ వాహనంలో వారద్దరిని తీసుకొచ్చి మంగళగిరి(Mangalagiri)లో విడిచిపెట్టారు. ఆ సమయంలో పవన్‌కి ఘన స్వాగతం లభించింది. వారందరికి అభివాదం చేసి అనంతరం ఆయన లోపలికి వెళ్లారు. అయితే అంతకముందు పోలీసులు తనని అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని జనసేనాని నిరసన తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయింది.
విజయవాడ(Vijayawada)కు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ (Checkpost) వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని జనసైనికులు తొలగించడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది.అయితే జనసేనాని పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర (Varahi Yatra)తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఏపీకి బయల్దేరాను. కానీ తనను మార్గం మధ్యలోనే పోలీసులు ఆపేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.