జీ20 సమ్మిట్ (G20 Summit) కు వచ్చిన దేశాల అధినేతలు ఢిల్లీ రాజ్ ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. వారికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఉదయమే భారత్ మండపం నుంచి బయలుదేరి రాజ్ ఘాట్ (Raj Ghat) కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రధాని వారికి స్వాగతం పలికి, స్వయంగా తోడ్కొని వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Jobaiden), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్జెల్ ఫత్తా, తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దేశాధినేతలంతా తిరిగి భారత్ మండపానికి బయలుదేరారు. సమిట్ లో భాగంగా నేడు ప్లాంటేషన్ సెర్మనీకి హాజరుకానున్నారు. జీ20 సమిట్ తొలిరోజు శనివారం నాడు ఢిల్లీ (Delhi) డిక్లరేషన్ కు సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. దీంతో పాటు అమెరికా (America), ఇండియా, సౌదీ అరేబియా, యూరోప్ లను కలుపుతూ మెగా రైల్, పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించిన మెగా ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది. జీ20లోకి శాశ్వత సభ్య దేశంగా ఆఫ్రికా(Africa) యూనియన్ ను మోదీ స్వాగతించగా.. మిగతా సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో జీ20 సభ్య దేశాల సంఖ్య 21కి చేరింది.