వాహనాలు సిద్ధం చేస్తున్న పోలీసులు చంద్రబాబు (Chandrababu) కేసును విచారిస్తున్న విజయవాడ ACB కోర్టు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కోర్టు రిమాండ్కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలు(Central Jail)కు తరలించే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా అదనపు సెక్యూరిటీ(Security)ని తీసుకురావడంతో పాటు, కాన్వాయ్ కోసం మరిన్ని బలగాల వాహనాలు రప్పిస్తున్నారు. మీడియాను సైతం కోర్టు పరిసరాల నుంచి దూరంగా పంపిస్తున్నారు. దీంతో కోర్టు లోపల ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
చంద్రబాబు అరెస్టుపై విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్(London), ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ (CM Jagan) కు ఈ నిరసన సెగ తగిలింది. లండన్ లో ఆయన బస చేసిన ప్రాంతంలో ఎన్ఆర్ఐలు (NRI) నిరసన ప్రదర్శన చేశారు.
అక్రమ అరెస్టు (Arrest) ను ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదాం అంటూ నినాదాలు చేస్తూ పలువురు టీడీపీ అభిమానులు ఆందోళన నిర్వహించారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్ లో’ ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం (Statue of Gandhi) దగ్గర ఎన్ఆర్ఐ టీడీపీ లీడర్లు స్వాతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెదర్లాండ్స్ తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో టీడీపీ (TDP) ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు