• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వెంకటేశ్వర స్వామితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోంది’

E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. వారి తీరు హిందువుల మనోభావాల‌ను దెబ్బతీశారన్నారు.

February 21, 2026 / 09:34 PM IST

‘కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు సిగ్గుచేటు’

అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టా అని పేర్కొన్నారు.

February 21, 2026 / 09:31 PM IST

అక్రమ ఇసుక రవాణా టిప్పర్‌ సీజ్

KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు శనివారం తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 09:30 PM IST

‘పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి’

KDP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆర్‌ఐవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు స్వల్ప సడలింపు ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 09:30 PM IST

బాధితులకు త్వరితగతిన న్యాయం: ఏఎస్పీ

ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:00 PM IST

‘రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం’

అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

February 21, 2026 / 09:00 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాలని డీజీపీకి ఎమ్మెల్యే ఆహ్వానం

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ ఆహ్వానించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఆయను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలని కోరారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను ఆయన వివరించారు.

February 21, 2026 / 09:00 PM IST

‘రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ ప్రారంభం’

TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:43 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి: ఎమ్మెల్యే

SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : హౌసింగ్ పీడీ

TPT: తిరుపతి హౌసింగ్ కార్యాలయంలో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పనులను వేగవంతం చేసి, నాణ్యత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

మహావీర్ సర్కిల్ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి

కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

February 21, 2026 / 08:32 PM IST

సజ్జాపురంలో అగ్నిప్రమాదం

W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

February 21, 2026 / 08:32 PM IST

గురుకుల పాఠశాలలో సంక్షేమ శాఖ అధికారులు తనిఖీ

KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాగముని, పూర్ణచంద్రరావు శనివారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని శిథిలావస్థమైన తరగతి గదులను సందర్శించి, పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.

February 21, 2026 / 08:30 PM IST

రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.

February 21, 2026 / 08:23 PM IST

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.

February 21, 2026 / 08:23 PM IST