ATP: గత ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి కేవలం 30 వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయని పేర్కొన్నారు. మరి అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయని, ఆ ఓట్లు దెయ్యాలు లేదా ఆత్మలు వేశాయా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
SKLM: మెలియాపుట్టి (M) గాథలవలస గ్రామంలో శ్రీ సవర పోలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు.
CTR: చిత్తూరులో టీడీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి కార్యాలయం కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
కడప జిల్లా TDP పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ జరిగింది. జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో జిల్లా టీడీపీ నాయకులు, నగర కమిటీ సభ్యులు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నేరాలు, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
TPT: కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో DR&O జి.నరసింహులు, ఆధికారులు పాల్గొన్నారు.
VSP: విశాఖలోని 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతానికి చెందిన పెద్దిలమ్మ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానన్నారు.
కోనసీమ: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆనందం, సంతోషం అందించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్‌లోని బాలికల హైస్కూల్లో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, స్థానిక ఎస్సై నాగరాజుతో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి, పరీక్షా నిర్వహణ అధికారికి తెలియజేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ శాశ్వత పార్లమెంటు కార్యాలయ నిర్మాణానికి నేడు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొన్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సొంత భవనం ఏర్పాటు కానుండటంతో కార్యకర్తలు పండుగలా వేడుక చేసుకున్నారు.
PLD: డిజిటల్ ప్రపంచంలో ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా గృహిణులు, వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని, పార్ట్ టైమ్ జాబ్స్ ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. మోసపోయామని గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
TPT: రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలోని జలపాతంలో చెన్నైకి చెందిన మణికంఠన్ (27) మునిగి మృతి చెందాడు.స్నేహితుడు శ్రీనివాసన్తో కలిసి బైక్‌పై విహారయాత్రకు వచ్చి జలపాతం వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు. అయితే సుమారు 8 అడుగుల లోతైన గుంటలో మునిగిపోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ELR: జంగారెడ్డిగూడెం స్థానిక బైపాస్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చి వద్ద లారీ బోల్తా పడింది. తెలంగాణ వైపు నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్న లారీ ఆర్చి దగ్గరకి రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గోవింద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.
AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో తేదీ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు తెలియని స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లులో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.