ATP: గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో 4200 పోస్టును భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
VZM: బొండపల్లి మండలంలోని రాచకిండంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాలవలస నూకాలు పూరిల్లు కాలిపోయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో మంటలను అదుపు చేశారు.
AKP: పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. ఎలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీవో 36ను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సూచించారు.
అన్నమయ్య: మంగళవారం అసెంబ్లీలో RTC డిస్పెన్సరీలు, ఉద్యోగుల ఆరోగ్య పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు, విజయవాడలో సెంట్రల్ ఆసుపత్రి ద్వారా 45 వేల RTC ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.EHS పథకం కింద 1,900 ఆసుపత్రుల్లో ఉద్యోగులు, వారి కుటుంబాలకు చికిత్స సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
KRNL: గోనెగండ్ల మండలం గంజహళ్లిలో మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని దర్గాను దర్శించుకున్నారు. పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముదుగోల్, మహబూబ్ బాషా సంప్రదాయబద్ధంగా శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.
NDL: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 296 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా డీఐఈవో శంకర్ నాయక్ వెల్లడించారు. మొత్తం 14,424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల కొందరు రాలేకపోయారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వివరించారు.
SKLM: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ కు బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరుతూ శ్రీకాకుళం ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం CITU టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశ రావు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసవేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయడం లేదని అన్నారు.
కృష్ణా: గుడివాడలో సోషల్ మీడియా, ఈవ్ టీకింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలపై ట్రాఫిక్ ఎస్సై నాగరాజు విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. సోషల్ మీడియా వేదికల్లో తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలను అప్లోడ్ చేయకూడదని తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
NTR: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్ నియమితులైన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయనను ఘనంగా సత్కరించారు. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.
ASR: మార్చ్ 1 ఆదివారం కావడంతో ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ జరగుతుందని అడ్డతీగల ఎంపీడీవో ఎవీవీ కుమార్ పేర్కొన్నారు. ఫింఛను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. మండలంలో ఉన్న 5211 ఫించన్లకు రూ.2,15,48,500లు మంజూరైనట్లు మంగళవారం ఎంపీడీవో తెలిపారు. సచివాలయ సిబ్బంది ఈనెల 27న పింఛను అమౌంట్ బాంకు నుంచి విత్డ్రా చేయాలని అన్నారు.
ప్రకాశం: సీఎం చంద్రబాబు దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంఖస్థాపన, మార్కాపురం బహిరంగ సభ పర్యటన సందర్భంగా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మండల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్సాహంగా బయటికి వచ్చారు. పరీక్షలు బాగా రాశామని సంతోషం వ్యక్తం చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 620 మంది హాజరు కావాల్సి ఉండగా 591 మంది హాజరయ్యారు. 29 మంది గైరా హాజరైనట్లు అధికారులు తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రీన్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒకటో సచివాలయం రోడ్డులో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందవచ్చని నిర్వాహకుడు ఆదినారాయణ తెలిపారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.