ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవనిగడ్డ వంతెన సెంటరులో ఆయన విగ్రహానికి మంగళవారం మండల రేషన్ డీలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఉపాధ్యాయులు తమ సేవలను గుర్తించినందుకు పీవోకు కృతజ్ఞతలు తెలిపారు.
ATP: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం అమలు చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
NTR: నందిగామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కొట్టె హరికృష్ణ, సభ్యులుగా ఘంటా వెంకట్రావు, మన్నెం వేణుగోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండి విశిష్ట సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వాకాడులో Government ITI College, SV High Schoolలో విద్యార్థులతో సమావేశమయ్యారు. Act (POCSO)పై వారికి అవగాహన కల్పించారు. చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించడంపై ప్రాముఖ్యతను వివరించారు.
WG: ఆకివీడు సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు యూటీఎఫ్ ఆకివీడు శాఖ మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఆర్పీఎస్ నారాయణ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖపట్నం నగర దేవత కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం అష్టదళ పద్మారాధన సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగ్గురు ఉభయదాతలు పాల్గొని ప్రత్యేక నైవేద్యాలు, పుష్పార్చనలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ సేవలో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PPM: ఆదివాసి గిరిజనులు పండించే ఉత్పత్తులు కొండ శిఖరాలలో పండించే ఉత్పత్తులను జిసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫారం జిల్లా అధ్యక్షుడు ఐ.రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాలో గిరి శిఖర గ్రామాలలో గిరిజనులు పంటలను పండించుకుంటూ వారి జీవనాధారం సాగించుకుంటూ ఉంటున్నారన్నారు.
కడప: నగరంలోని ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో తాగునీటి సమస్యపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ఆర్‌ఓ ప్లాంట్ చెడిపోవడంతో 350 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో నీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ASR: ప్రజలే మా బలం.. గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం హుకుంపేట(మం) తాడిపుట్టు గ్రామ సచివాలయ (స్వర్ణ గ్రామం) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాడిపుట్టును ఆదర్శ స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ సోమెలి సత్యవతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
BPT: జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,287 మంది రైతులకు అందజేశామని తెలిపారు. మిగిలిన పుస్తకాలను కూడా జాప్యం లేకుండా తక్షణమే అర్హులకు అందించాలని అధికారులను ఆదేశించారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారం ఐదవ రోజుకు చేరాయి. దీక్షాపరులకు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు అందించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని వారు దీక్షాపరులకు హామీ ఇచ్చారు.
NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు లెక్కించారు. మంగళవారం ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ.. మూడు నెలలకు గాను హుండీ ఆదాయం రూ.19,83,056 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: కంభంలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కార్పియో కారును మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. కంభంలోని తన నివాసంలో సమయంలో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించి మంటలను ఆర్పి వేసినట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపాడు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించి కారును తగలబెట్టారన్నారు.