• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఈనెల 29, 30 తేదీలలో గ్రామసభలు’

CTR: ఈనెల 29, 30 తేదీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ సభలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సభల ద్వారా సబ్ డివిజన్ కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. జాయింటు పట్టాదారులకు వెసులుబాటు కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

August 28, 2025 / 12:13 PM IST

‘PACS భవనానికి నిధులు మంజూరు చేయండి’

PPM: సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలోని PACS బ్యాంక్‌కు కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని అభ్యర్థించారు. సాలూరులో ఆమె క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామ ప్రజలు వినతి పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు.

August 28, 2025 / 12:10 PM IST

వెంకటగిరిలో దారుణ హత్య

TPT: వెంకటగిరి పరిధిలో దారుణ హత్య జరిగింది. రైల్వేస్టేషన్ నుంచి పెట్లూరుకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు. మృతుడు అమ్మపాలెం గ్రామానికి చెందిన శివారెడ్డి (23)గా గుర్తించారు. మంగళవారం సాయంత్రం అతను అదృశ్యమయ్యాడు. ఇలా శవంగా కనబడటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

August 28, 2025 / 12:05 PM IST

ప్రజల వినతులు స్వీకరించిన మంత్రి

SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్న నాయుడు తన కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్‌లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

August 28, 2025 / 12:00 PM IST

అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమి పూజ

SKLM: నరసన్నపేట పట్టణంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గురువారం భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్న క్యాంటీన్ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. వేలాది మంది పేదలు, కూలీలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ క్రమంలో పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.

August 28, 2025 / 11:56 AM IST

రికార్డ్ స్థాయిలో CMRF చెక్కుల పంపిణీ

NLR: మంత్రి ఆనం గురువారం సంతపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన బాధితులకు దాదాపు రూ.83.34 లక్షలను చెక్కుల రూపంలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు రూ.4.20 కోట్లు అందించామన్నారు.

August 28, 2025 / 11:55 AM IST

అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి

BPT: అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువలకు మంత్రి రవికుమార్ ప్రారంభోత్సవం చేశారు. కోటి రూపాయలతో నిర్మించిన తారు రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. 35 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

August 28, 2025 / 11:52 AM IST

ఇంటి పై నుంచి జారీ పడి వ్వక్తి మృతి

PPM: పార్వతీపురం పట్టణంలోని గణేష్ నగర్‌లో గురువారం ఇంటిపై నుండి జారీ పడి రాము అనే వ్వక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి కి పెయింట్ వేస్తుండగా జారీపడ్డారు అని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు.

August 28, 2025 / 11:52 AM IST

రూ.25వేలు ఆర్థికసాయం చేసిన మంత్రి

సత్యసాయి: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను రిపోర్టర్లు కలిశారు. హిందూపురం జర్నలిస్ట్ రాజ్ గోపాల్ కాన్సర్ బారిన పడ్డ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ వంతు రూ.25వేలు ఆర్థికసాయం చేస్తున్నామని చెప్పగా మంత్రి స్పందించారు. తానూ మరో రూ.25వేలు ఇవ్వడంతో మొత్తం రూ.50వేలను బాధితుడికి అందజేశారు. అవసరమైతే వైద్య సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.

August 28, 2025 / 11:51 AM IST

విద్యుత్ చార్జీలపై ప్రజాసంఘాల ఆందోళన

NDL: విద్యుత్తు చార్జీల బారాలను నిరసిస్తూ నందికొట్కూరులో పటేల్ సెంటర్‌లో వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై బారాలను వేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు.పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేపడతామన్నారు.

August 28, 2025 / 11:49 AM IST

వినాయక మండపంలో హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పాతూరులో గురువారం తెల్లవారుజామున వినాయక మండపం వద్ద ఉన్న హుండీని గుర్తుతెలియని దుండగులు తీసుకువెళ్లారని గణేష్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం పారిశుద్ధ కార్మికులు గణేష్ మండపం వద్ద శుభ్రం చేస్తుండగా గమనించినట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో పాతూరులో దొంగతనాలు ఎక్కువైతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. 

August 28, 2025 / 11:48 AM IST

సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున సేనతో సేనాని సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు విశాఖలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. జనసేన అధినేత చేపట్టిన సేనతో సేనాని సమావేశాలు జనసేన పార్టీకి కొత్త బలం ఇస్తుందని పేర్కొన్నారు.

August 28, 2025 / 11:47 AM IST

లింగాలపాడు పాఠశాలను పరిశీలించిన ఎంఈవో

SKLM: జలుమూరు మండలం లింగాలపాడు పంచాయతీ ఎర్రనపేట ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బమ్మిడి మాధవరావు గురువారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు ఉన్న సామర్థ్యం ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంపై కార్య నిర్వాహకులతో చర్చించారు.

August 28, 2025 / 11:44 AM IST

వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్

సత్యసాయి: సోమందపల్లిలో డీలర్ సోము 65 ఏళ్లు నిండిన వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి గురువారం సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతీ నెల ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

August 28, 2025 / 11:41 AM IST

లంక గ్రామాలకు భారీ వరద హెచ్చరిక

GNTR: కొల్లిపర మండలంలోని కృష్ణా నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని గురువారం అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నది పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం కొల్లిపర తహసీల్దార్ జి. సిద్ధార్థ సూచించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లే భక్తులు పొరపాటున కూడా కృష్ణా నది వైపు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.

August 28, 2025 / 11:41 AM IST