• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

17 మంది జూదరులు అరెస్టు

TPT: చంద్రగిరి పరిధిలో 17 మంది పేకాటరాయుళ్లలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న డ్రోన్ కెమెరా టీం జూదం ఆడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1,40,000ల నగదు, 15 మొబైల్ ఫోన్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.

August 28, 2025 / 06:07 AM IST

సెనగలతో వినాయకుడు

KDP: వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతోపాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు.

August 28, 2025 / 06:07 AM IST

ఈనెల 30, 31 తేదీల్లో మహిళా సాఫ్ట్‌బాల్ పోటీలు

GNTR: రాష్ట్రస్థాయి మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు ఈనెల 30, 31 తేదీలలో ధూళిపాలలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయని బుధవారం సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

August 28, 2025 / 06:06 AM IST

వ్యాపారం ముగిసింది..చెత్త మిగిలింది

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి అమ్మకాలు జరిపారు. బుధవారం వ్యాపారం ముగిసిన తర్వాత, వారు తమ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లడంతో రహదారి ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

August 28, 2025 / 05:56 AM IST

శేషాచలం అడవుల్లో పెద్ద పులి సంచారం

అన్నమయ్య: చిట్వేలి శేషాచలం అడవుల్లో పెద్దపులి దర్శనమిచ్చింది. ఇటీవల రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన 30 ట్రాప్ కెమెరాల్లో పగలు, రాత్రి పులుల సంచారం రికార్డు అయ్యింది. రెండు నుంచి మూడు పులులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ నుంచి నల్లమల–శేషాచలం కారిడార్ ద్వారా వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

August 28, 2025 / 05:54 AM IST

వినాయక చవితి వేడుకల్లో పుస్తకాల పంపిణీ

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం యువకులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు, శశి, కుమార్, రాజు వినాయకునికి సంబంధించిన పుస్తకాలను గ్రామ యువకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

August 28, 2025 / 05:50 AM IST

మృతుని కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

KKD: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో కరెంట్ షాక్‌తో చరణ్ మృతి చెందిన సంగతి విధితమే. ఈ సమాచారం తెలుకున్న జనసేన పిఠాపురం ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు ఆ పార్టీ నేత జోతుల శ్రీనివాసరావు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు.

August 28, 2025 / 05:47 AM IST

300 అరిటాకులతో వినాయక మండపం

KDP: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో 300 అరటి ఆకులతో వినాయక మండపాన్ని నిర్మించి, వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి కర్పూరాలు సమర్పించారు. పులివెందుల మండలంలో 300 అరటి ఆకులతో వినాయక మండపం ఏర్పాటు చేయడం విశేషం.

August 28, 2025 / 05:47 AM IST

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు

ELR: చింతలపూడి నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా రహదారి మరమ్మతులు లేకపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. చింతలపూడిలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

August 28, 2025 / 05:29 AM IST

విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు: ఎస్ఈ

ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బందిని ఎస్ఈ పి. సాల్మన్ రాజు బుధవారం అప్రమత్తం చేశారు. పట్టణంలో ఆర్.ఆర్.పేటలోని విద్యుత్ భవన్‌లో 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయంలో 9491030712 నంబర్లతో 24 గంటల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

August 28, 2025 / 05:11 AM IST

వీది కుక్కల దాడిలో 15 నాటు కోళ్లు మృతి

PPM: గుమ్మలక్ష్మీపురం స్దానిక విశ్వనాథపురంలో వీధి కుక్కల దాడిలో బుధవారం దాదాపు 15 నాటు కోళ్లు మృతి చెందాయి. ఈ మేరకు స్థానికులు తెలపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రసాదరావు సమీపంలో ఓపాకలో 45 జాతి కోళ్లును పెంచుతున్నాడని, వినాయక పూజ నిమిత్తం అతడు ఇంటికి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా పాకలోకి చొరబడి దొరికిన కోళ్లను చంపేశాయన్నారు.

August 28, 2025 / 04:52 AM IST

ఆపరేషన్ సిందూర్ వినాయక మండపం

PPM: పాలకొండలోని పెద్దకాపు వీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ గణేశ్‌ మండపం అందరినీ ఆకట్టుకుంటుంది. పహల్లాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చెప్పటిన ఆపరేషన్‌ సిందూర్‌లో సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఈ నమూనాను రూపొందించామని, గతంలో చంద్రయాన్‌-3 నమూనాతో కూడా గణేశ్‌ మండపం నిర్మించామని కమిటీ సభ్యులు పెర్కొన్నారు.

August 28, 2025 / 04:46 AM IST

టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

CTR: కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్తో పాటు టీడీపీ నేతలు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

August 28, 2025 / 04:44 AM IST

మంత్రి నాదెండ్లతో నెల్లిమర్ల ఎమ్మెల్యే భేటి

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఈ నెల 30న జరగనున్న సేనతో సేనాని భారీ బహిరంగ సభ కార్యక్రమంపై చర్చించారు. అనంతరం మంత్రితో కలిసి ఆమె సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ భలోపేతమే లక్ష్యంగా సమావేశం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

August 28, 2025 / 04:23 AM IST

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉ.9 నుంచి క్యాంపు కార్యాలయం సమీపంలోని GKకల్యాణ మండపంలో స్త్రీ-శక్తి సూపర్‌ సిక్స్–సూపర్‌ హిట్‌ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఒడిస్సా భువనేశ్వర్‌‌లో జరగనున్న ఫస్ట్‌ మీటింగ్‌ 11th ZRUCC అఫ్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సమావేశంలో పాల్గొనుటకు వెళ్ళనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు బుధవారం ...

August 28, 2025 / 04:17 AM IST