• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కోడుమూరు రాజవర్ధన్ రెడ్డి కుటుంబానికి భారీ పరిహారం

KRNL: మాజీ MPP రాజవర్ధన్‌రెడ్డి రోడ్డు ప్రమాద మృతి కేసులో ఆయన కుటుంబానికి రూ. 2.25 కోట్లు నష్టపరిహారం 7.5% వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 20న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పిటిషన్‌పై విచారణ అనంతరం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

February 20, 2026 / 12:04 PM IST

టమాటా కేజీ ధర రూ.5 మాత్రమే..!

AKP: నర్సీపట్నం కాయగూరలు మార్కెట్లో కేజీ టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే ఉండడంతో దారుణంగా నష్టపోతున్నామని పలువురు రైతులు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. రైతు బజార్లో కనీసం కేజీ రూ.10లకు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 20, 2026 / 12:01 PM IST

మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 12:01 PM IST

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.

February 20, 2026 / 12:00 PM IST

చింతలపూడిలో విద్యార్థులకు అవగాహన సదస్సు

ELR: చింతలపూడిలోని PMSHRI ZP హైస్కూల్లో శుక్రవారం పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు, మత్తు పదార్థాల నివారణ కొరకు, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ అధికారులను నేరుగా, ధైర్యంగా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 11:59 AM IST

మహా సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

CTR: పలమనేరు శ్రీ భూనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థాన మహా సంప్రోక్షణ పూజల్లో పలమనేర్ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన నూతన విమాన గోపుర రాజగోపుర మహా కుంభాభిషేక, స్వామి వారి నవీకరణ జీర్ణోద్ధారణ, అష్ట బంధన పూజల్లో ఆమె పాల్గొన్నారు.

February 20, 2026 / 11:54 AM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన టీడీపీ నేతలు

KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ నాయకులు తాయన్న, దాసప్ప రెడ్డి, నరసింహులు, వలి తాతా శుక్రవారం జేసీపీతో ప్రారంభించారు. హరిశ్చంద్రప్ప కాలనీలో వేమారెడ్డి ఇంటి నుంచి తారాపురం నరసింహులు ఇంటి వరకు, లక్ష్మన్న ఇంటి నుంచి బెల్లం బాషా ఇంటి వరకు రెండు రోడ్లను రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.

February 20, 2026 / 11:54 AM IST

ఆమదాలవలసలో ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: ఆమదాలవలసలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

February 20, 2026 / 11:49 AM IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ATP: గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సులోచన అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్య సేవలు అందించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 11:48 AM IST

పొలాల్లో గాలి మరలు.. పనులు వేగవంతం

KRNL: ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామ పొలాల్లో గాలి మరల (ఫ్యాన్లు) పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరలు నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చినందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే కొన్ని గాలి మరలు పూర్తయ్యాయని, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.

February 20, 2026 / 11:46 AM IST

అరుదైన వారందరికీ పింఛన్లు రేషన్ కార్డులు మంజూరు

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ సమన్వయకర్త పీలా గోవింద హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. శుక్రవారం ప్రజలు పార్టీ శ్రేణులకు పలు సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. అనారోగ్యానికి గురై చికిత్స తీసుకున్న వారికి CMRF చెక్కులు అందజేశారు.

February 20, 2026 / 11:44 AM IST

పీఎన్ కాలనీలో తాగునీటి కులాయి నీరు వృధా..!

శ్రీకాకుళంలోని గుజరాతి పేట సమీపంలోని పురుషోత్తం నగర్ కాలనీలో తాగునీటి కుళాయి నుంచి నీరు వృథాగా పోతుంది. దీని మూత పాడవడంతో నీరు పైనుంచి ధారలా కారుతుంది. గత కొన్ని రోజులుగా నీరు ఇలాగే వృధాగా పోతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

February 20, 2026 / 11:40 AM IST

‘రైతులు కార్మికులకు బకాయిలు చెల్లించాలి’

AKP: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రైతులు కార్మికులు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ.. పీపీపీ విధానంలో డిష్టలరీ, ఇథనాల్ ఉత్పత్తి చేసే విధంగా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలన్నారు.

February 20, 2026 / 11:39 AM IST

చిన్నారిని ఢీకొన్న కారు.. పరిస్థితి విషమం

CTR: పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు దాటుతున్న చిన్నారి (5)ని 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గాయపడ్డ చిన్నారిని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు.

February 20, 2026 / 11:38 AM IST

‘ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలి’

ప్రకాశం: తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామం లో పంట నమోదు వివరాలను ఏవో ప్రసాద రావు శుక్రవారం పరిశీలించారు. ఈ పంట నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సూపర్ చెక్ చేయటం జరుగుతుందని ఏవో చెప్పారు. రబీలో ఇప్పటి వరకు 17,536 ఏకరాలు ల్యాండ్ చేయటం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 11:36 AM IST