• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూతన సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

KDP: ఖాజీపేట(M) ముత్తలూరుపాడు, మూలవారిపల్లె గ్రామాల్లో దాదాపు రూ. 20 లక్షలతో నూతనంగా సిమెంటు రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ కొంగని వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామయ్య వార్డు మెంబర్ సునీత పాల్గొన్నారు.

February 20, 2026 / 12:36 PM IST

గన్నవరంలో జగన్‌ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం

కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా పలకరించారు. శుక్రవారం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఇద్దరూ కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఈ అనూహ్య భేటీ అక్కడున్న ప్రయాణికులు, అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.

February 20, 2026 / 12:35 PM IST

అతి పెద్ద మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

E.G: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన మహమ్మద్ జరీనాకు రూ. 1,55,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల, వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఈ చెక్కు అందించడం జరిగింది అన్నారు.

February 20, 2026 / 12:34 PM IST

‘ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థకే కేటాయించాలి’

ప్రకాశం: ఆర్టీసీ గ్యారేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమస్త కేటాయించాలని, గ్యారేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 12:32 PM IST

ఆకివీడు నుంచి అసెంబ్లీ సందర్శనకు విద్యార్థులు

W.G: ఆకివీడులోని విద్యార్థులు అసెంబ్లీ సందర్శించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌కు, సరోజినీ నాయుడు బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక హై స్కూల్ వద్ద బస్సులో విద్యార్థులు ఎక్కించి కూటమి నాయకులు జండా ఊపి ప్రారంభించారు.

February 20, 2026 / 12:32 PM IST

‘ఎమ్మెల్యే బడేటి ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం’

ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని బడేటి చంటి శుక్రవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత నిస్తూ కృషి చేస్తున్నామన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రజలు నిరాశతో వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఉదయాన్నే వినతులు స్వీకరించామన్నారు.

February 20, 2026 / 12:32 PM IST

దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని నిర్మించిన నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిత్యపూజల కోసం రూ. 2.లక్షల విరాళం అందజేశారు.

February 20, 2026 / 12:31 PM IST

ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి: గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

February 20, 2026 / 12:30 PM IST

గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ ట్రాక్‌పై శుక్రవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు ఢీకొనడం వల్లే సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మెరూన్, తెల్ల రంగు బొమ్మలున్న చొక్కా ధరించి ఉన్నదని ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

February 20, 2026 / 12:30 PM IST

‘నిర్దిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి కృషి చేద్దాం’

CTR: నిర్దిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరి సహకారం అవసరమని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణ కుమారి తెలిపారు. పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై సమీక్షించారు. తర్వాత రాజకీయ నాయకులు వారి వారి సలహాలు సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 12:24 PM IST

ఈ నెల 23 నుండి క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపికలు

PPM: క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి జిల్లా స్థాయి ఎంపిక నర్సిపురం ZP హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈనెల 23న పార్వతీపురం, సీతానగరం,బలిజిపేట,24న గుమ్మలక్ష్మీపురం,కురుపాం, జియమ్మవలస,25న గరుగుబిల్లి, కొమరాడ,వీరఘట్టం,26న భామిని, సీతంపేట,పాలకొండ,27 సాలూరు, పాచిపెంట, మక్కువ వారు హాజరుకావాలన్నారు.

February 20, 2026 / 12:21 PM IST

‘సహకార చక్కెర ఫ్యాక్టరీలపై శాసనసభలో చర్చ పెట్టండి’

VZM: ఉత్తరాంధ్రలో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను,రైతులను,కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక చర్చ జరిగేలా చూడాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. ఈ మేరకు ప్రభుత్వ పరిశ్రమలు కార్యదర్శి డా ఎన్.యువరాజ్, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వి.వెంకటరావు లను శుక్రవారం సచివాలయంలో కలసి వారికి వినతిపత్రం అందజేశారు.

February 20, 2026 / 12:17 PM IST

విద్యాదాన ట్రస్టుకు రూ. 50 లక్షల విరాళం

TPT: హైదరాబాద్‌కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళంగా చెక్కును అందజేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో దాత కుటుంబ సభ్యులను అభినందించారు.

February 20, 2026 / 12:16 PM IST

ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యం

SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 12:12 PM IST

కలెక్టర్ కార్యాలయం వద్ద వాటర్ సప్లై వ్యాన్‌కు ప్రమాదం

VSP: కలెక్టర్ ఆఫీస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా శ్రీ వెంకటేశ్వర వాటర్ సప్లైకి చెందిన వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగించింది. స్పీడ్ బ్రేకర్ వద్దే వాహనం నుజ్జునుజ్జు కావడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా? తగిన తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

February 20, 2026 / 12:08 PM IST