అన్నమయ్య: పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నా క్యాంటీన్లు, మునిసిపల్ సేవలు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతలపై సమీక్ష జరిగింది. పథకాల అమలు సజావుగా కొనసాగాలని సీఎస్ సూచించారు.
CTR: CMRF పేదల వైద్య సేవలకు ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం నియోజకవర్గానికి సంబంధించి 24 మంది లబ్ధిదారులకు రూ.35,35,182 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా CM చంద్రబాబు CMRF ద్వారా పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. వైద్య సేవల కోసం అప్పులు చేయకుండా ఆర్థిక సాయం అందిస్తునారని తెలిపారు.
PPM: సహకార సొసైటీల సిబ్బంది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ అన్నారు. శుక్రవారం DCCB కార్యాలయం వద్ద PACS ఉద్యోగులతో నిరసన తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం 30, 40 సంవత్సరాలుగా PACSలలో ఉద్యోగులుగా పని చేస్తున్న వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ తక్షణమే జీవో నంబర్ 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం చేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలంలో రైతులు ప్రధానంగా పొగాకు, కంది సాగుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నీటి వనరులు ఉన్న రైతులు బొప్పాయి పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. మండలంలో దాదాపు 500 ఎకరాలకుపైన బొప్పాయి పంట సాగులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. నీటి వనరులు ఉంటే బొప్పాయి పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు తెలిపారు.
సత్యసాయి: పరిగి మండలం 11కేవీ పెద్దిరెడ్డిపల్లి ఫీడర్‌లో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు 11కేవీ లైన్ క్రింద మంటలు పెట్టడంతో ఈ అంతరాయం ఏర్పడినట్లు పరిగి ఏఈ సంజీవప్ప తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. త్వరలో విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ తెలిపారు.
NLR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు.
కోనసీమ: ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు విశేషంగా కృషి చేయాలని కొత్తపేట జనసేన ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రావులపాలెం మండలం లక్ష్మిపోలవరం గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరులో నడి రోడ్డుపై మూగజీవులు సంచారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆవులు ప్రమాదకరంగా నడిరోడ్డుపై తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్, కోరుకొండ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగగా ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ATP: గార్లదిన్నె మండలంలో సింగరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరుగుతాయని గ్రామస్తుల శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈనెల 21న న్యూ కేటగిరి విభాగానికి పోటీలు ఉండగా, 22న సీనియర్ కేటగిరి విభాగానికి పోటీలు జరుగుతాయన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు.
KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈనెల 23న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు.10th ఆపై చదివిన, 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.
TPT: పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు “ఫీల్ ది థ్రిల్” నినాదంతో ఫేర్‌వెల్ వేడుకలు నిర్వహించారు. నాగలాపురం ఎస్సై సునీల్, ఎంఈవో-2 యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
TPT: సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలోని పునర్నిర్మిత శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, కంకణ ధారణ, యాగశాల కలశ స్థాపన నిర్వహించారు. సాయంత్రం వాస్తు పూజలు జరిపారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా, ఆలయం దీపాలతో అలంకరించబడింది. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.
కడప జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశించారు. జమ్మలమడుగు, పులివెందుల సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
VZM: ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.