• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి

శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్‌ చికెన్ సుమారు ₹265కు, స్కిన్‌లెస్ సుమారు ₹270కు, బోన్‌లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతున్నాయి, మరియు షాపులివ్వే రేట్లు కొంచెం తేడాలతో మారవచ్చని సూచనలున్నాయి.

February 22, 2026 / 08:45 AM IST

APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

CTR: పలమనేరు ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.

February 22, 2026 / 08:43 AM IST

గ్యాస్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు: జేసీ

KKD: గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను హెచ్చరించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, లీడ్ బ్యాంక్ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

February 22, 2026 / 08:37 AM IST

‘బిఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపరచాలి’

ASR: అనంతగిరి మండలం కొండిభ పంచాయతీలో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ మూగబోయిందని తక్షణమే సెల్ సేవలు అందించాలని గ్రామస్తులు బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత వారం రోజులుగా సేవలు నిలిచి పోవడంతో వినియోగదారులతోపాటు పంచాయతీ సచివాలయ కార్యకలాపలు నిలిచిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సెల్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 08:36 AM IST

దలై పేటలో ఏనుగుల గుంపు కలకలం

PPM: కొమరాడ మండలం దలైపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది ఆదివారం ఉదయం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 22, 2026 / 08:32 AM IST

ఘనంగా ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం

విజయనగరం స్థానిక కోట జంక్షన్ వద్ద హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు హ్యాపీ సండే వేడుకను ప్రారంభించి, కార్యక్రమం ఔన్నత్యాన్ని విశదీకరించారు. పలువురు కళాకారులు పాటల రూపంలో, డాన్స్ ల రూపంలో తమ ప్రతిభను కనపరిచారు. మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఉల్లాసాన్ని కలిగించేందుకు హ్యాపీ సండే కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

February 22, 2026 / 08:30 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ

W.G: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం 34 మంది లబ్ధిదారులకు రూ. 27,15,924 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటివరకు 35 విడతల్లో మొత్తం 576 మందికి రూ. 4.79 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఆధారంగానే ఈ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

February 22, 2026 / 08:30 AM IST

చెత్తను తొలగించిన MRO

ASR: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొయ్యూరు MRO మురళీబాబు అన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర-స్వరాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం సిబ్బందితో కలిసి స్వయంగా చెత్తను తొలగించారు. కార్యాలయం లోపల, బయట ప్రాంగణంలో చెత్తా తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

February 22, 2026 / 08:18 AM IST

సీసీ కెమెరాల నిగా పెంచాలి: ఎస్పీ

NDL: రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాల నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మల సత్రం ఆర్టీసీ బస్టాండ్ బైర్మల్ విధి శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

February 22, 2026 / 08:18 AM IST

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

GNTR: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ సిద్ధమైందని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు అమరిక, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 08:16 AM IST

బంటనహళ్‌లో ఉచిత యోగా, గ్రంథాలయ కేంద్రం ప్రారంభం

KRNL: బెంగళూరులో స్థిరపడ్డ గ్రామ వాసి శ్రీ నాగరాజేంద్ర గౌడ్ గ్రామంలోని 5–12 ఏళ్ల పిల్లల కోసం ఉచిత యోగా శిక్షణ, గ్రంథాలయం, వ్యక్తి వికాస్ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవను అభినందించారు.

February 22, 2026 / 08:16 AM IST

ఎమ్మెల్యే కుమార్తెకు ‘యూత్ ఐకాన్’ అవార్డు

ATP: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో MLA దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె ఆశ్రితకు ‘యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా 25 కుటుంబాలను దత్తత తీసుకున్నందుకు ఆమెకు ఈ గౌరవం వరించింది.

February 22, 2026 / 08:14 AM IST

నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

SKLM: సారవకోట మండలం అలుదు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆనందరావు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల ఈ విషయాన్ని గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:12 AM IST

నర్సీపట్నంలో సందడిగా హ్యాపీ సండే

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ఉదయం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో పాల్గొనేందుకు పలువురు పోటీపడ్డారు. డాన్సులు చేస్తూ పెద్దలు, పిల్లలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ సిఐ షేక్ గపూర్ పాల్గొన్నారు.

February 22, 2026 / 08:10 AM IST

రేపు కమలాపురంలో రెవెన్యూ క్లినిక్

KDP: కమలాపురం మండల MRO కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు శివరాంరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామ ప్రజలు తమ భూ-ఇతర రెవెన్యూ సమస్యలను అర్జీరూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కడప రెవెన్యూ డివిజన్ అధికారి కూడా హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 22, 2026 / 08:08 AM IST