• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో వాహన తనిఖీలు

TPT: రేణిగుంట పట్టణంలో ఎంటీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో SI ధర్మారెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అధిక కాంతి వెలువరించే LED బల్బులు అమర్చిన వాహనాలను గుర్తించి తొలగించేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 06:16 AM IST

3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజుల శిక్షణ

అల్లూరి: స్వయం సహాయక సంఘాల గిరిజన మహిళలు, హస్తకళల వస్తువులను విక్రయించే మహిళలకు వచ్చేనెల 9,10వ తేదీల్లో ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. పాడేరు కాఫీ హౌస్‌లో జరిగే శిక్షణకు 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మహిళలు మార్చి 5లోగా పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.

February 21, 2026 / 06:16 AM IST

అన్నమయ్య: జిల్లాకు వర్ష సూచన..!

అన్నమయ్య: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

February 21, 2026 / 06:14 AM IST

మార్చి 28న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

సత్యసాయి: గోరంట్ల మండలంలోని కరవులపల్లి తండా వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని మార్చి 28న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించనున్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. విజేతలకు రూ. లక్ష ప్రథమ బహుమతి అందజేస్తారు. ఆసక్తిగల వారు మార్చి 27లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

February 21, 2026 / 06:14 AM IST

నేడు రాప్తాడులో పర్యటించనున్న ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 21, 2026 / 06:12 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట మండలంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు కొత్తూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగే స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30గంటలకు శ్రీ ఇందుపూరమ్మ-దేశమ్మ దేవతల మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు అని తెలిపారు.

February 21, 2026 / 06:12 AM IST

నేడు చేబ్రోలులో తాగునీటి సరఫరా నిలిపివేత

GNTR: చేబ్రోలు పంచాయతీ పరిధిలో శనివారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో రవిశంకర్ తెలిపారు. RSF ఫిల్టర్ బెడ్స్, సంప్ క్లీనింగ్ పనుల కారణంగా చేబ్రోలుతో పాటు కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.కావున ప్రజలు ఈ మార్పును గమనించి అధికారుల పనులకు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 06:11 AM IST

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.

February 21, 2026 / 06:11 AM IST

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.

February 21, 2026 / 06:11 AM IST

హోలీ వేళ ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు

ATP: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. యశ్వంతపూర్ నుంచి ధన్‌బాద్‌కు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి శనివారం వీక్లీ రైలు (06563) నడవనుంది. తిరుగు ప్రయాణంలో (06564) సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే యశ్వంతపూర్-హజ్రత్ నిజాముద్దీన్‌కు ఈనెల 25న ప్రత్యేక రైలు (06569) నడుస్తుందని అధికారులు తెలిపారు.

February 21, 2026 / 06:11 AM IST

మంత్రాలయంలో కళాకారుల నాట్య వైభవం

KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు మూడో రోజైన శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. యోగేంద్ర కళా మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. డాక్టర్ పద్మిని సంగీత కచేరి వీనులవిందుగా సాగగా, బెంగళూరుకు చెందిన నాటేశ్వర నృత్య కళాకారులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

February 21, 2026 / 06:11 AM IST

నేడు జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

SKLM: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్ర కళా సమితి అధ్యక్షులు శంకరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో స్వాగత ద్వారాలు, కళాకారులకు వసతికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిలకించేందుకు అందరూ రావచ్చన్నారు.

February 21, 2026 / 06:10 AM IST

నేడు జీరో వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు: MPDO

VZM: స్వచ్చాంధ్ర-స్వర్థాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ జీరో వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానిక MPDO రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు వేరుగా అందించే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్త వెయ్యవద్దన్నారు.

February 21, 2026 / 06:10 AM IST

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

E.G: ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 06:09 AM IST

‘రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి’

CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 2004లో మహేశ్ అనే వ్యక్తికి మంజూరైన 5 సెంట్ల భూమి పట్టాను నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

February 21, 2026 / 06:09 AM IST