తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కలెక్టర్ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగధనుల కృషి అని వివరించారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తుల గురించి ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చ...
నెల్లూరు రూరల్ పోలీసులపై టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు తీసుకెళ్లిన టీచర్‌ను వదిలేసి, పట్టించిన వారిపై కేసులు పెట్టడం ఏంటీ అని అడిగారు. 2వ డివిజన్ గుడిపల్లిపాడులో నిన్న జరిగిన ఘటన గురించి వివరించారు. పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి తీసుకెళ్తుండగా గ్రామస్తురాలు నాగభూషణమ్మ పట్టుకున్నారు. పట్టుకున్న ఆమెను పోలీస...
తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే ...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరు వివక్షకు గురవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు నీళ్లు ఇవ్వడానికి ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించారని గుర్తుచేశారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ...
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఆస్తులమ్మేశానని తెలిపారు. దాదాపు కోటి రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని పేర్కొన్నారు. అయితే చివరికీ తాను ఆస్పత్రిలో ఉంటే ఒక్క బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విభజన నేపథ్యంలో లోట...
సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ బుధవారం హైదరాబాద్ ను వీడారు. మళ్లీ 400 రోజుల తర్వాత హైదరాబాద్ లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పల...
తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు. వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని...
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...